కృష్ణ

అపరిచితులపై నిరంతర నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగటానికి అన్ని రాజకీయ పక్షాలు, స్వచ్చంద సంస్థలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. శుక్రవారం ఆయన మైలవరం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎన్నికలలో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా అవసరమైన పోలీస్ సిబ్బందిని, పారా మిలిటరీ దళాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగితే సగం ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లేనన్నారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా నగదు పంపిణీ, వస్తువుల పంపిణీ ఎన్నికలలో ప్రలోభాలకు సంబంధించిన కార్యకలాపాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల సంచారంపై ఆయన మాట్లాడుతూ గ్రామాలకు ఎవరెవరో వస్తుంటారని, పోతుంటారని కానీ అందరినీ దోషులుగా అనుమానించబోమన్నారు. కానీ అపరిచిత వ్యక్తుల కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారాలు, పార్టీల మారటాలు, ఫ్లెక్సీల ఏర్పాటు వంటి విషయాలలో గ్రామాలలో ఎవరూ ఘర్షణలకు పాల్పడవద్దని సూచించారు. సమావేశంలో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు, మైలవరం సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.