కృష్ణ

ఐదో రోజు నామినేషన్ల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఐదవ రోజైన శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 97 మంది అభ్యర్థులు మొత్తం 133 నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ స్థానాలకు 13 మంది 20 నామినేషన్లు దాఖలు చేశారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 84 మంది 113 నామినేషన్లు వేశారు. ఈ ఐదు రోజుల్లో ఇప్పటి వరకు పార్లమెంట్ స్థానాలకు 26, అసెంబ్లీ స్థానాలకు 237 మొత్తం 263 నామినేషన్లు దాఖలయ్యాయి. శని, ఆదివారాలు శెలవు దినాలు కావటంతో ఆ రెండు రోజులు నామినేషన్ల స్వీకరణ జరగదు. ఈ నెల 25వతేదీ అయిన సోమవారం ఒక్కరోజే నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నుండి నామినేషన్ల దాఖలు కార్యక్రమం ముగిసినా చివరి రోజైన సోమవారం కూడా భారీగానే నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఐదవ రోజైన శుక్రవారం మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థులుగా కొనకళ్ల నారాయణరావు, కొనకళ్ల చైతన్య, వైసీపీ అభ్యర్థులుగా వల్లభనేని బాలశౌరి, వల్లభనేని అనుదీప్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గొల్లు శ్యామలకుమారి, పులి శివరామకృష్ణ, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా వల్లూరి వెంకటేశ్వరరావు నామినేషన్లు వేశారు. విజయవాడ పార్లమెంట్‌కు వైసీపీ అభ్యర్థిగా పొట్లూరి ప్రసాద్, టీడీపీ అభ్యర్థులుగా కేశినేని నాని, కేశినేని పావని, బీజేపీ అభ్యర్థిగా కిలారు దిలీప్, ఇండిపెండెంట్‌లుగా ధనేకుల గాంధి, బాలిశెట్టి హరిబాబు నామినేషన్లు వేశారు. మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి మొత్తం ఏడు నామినేషన్లు దాఖలవ్వగా వైసీపీ అభ్యర్థిగా పేర్ని వెంకట్రామయ్య (నాని), జనసేన అభ్యర్థులుగా బండి రామకృష్ణ, బండి విజయ్ డానియేల్, బీజేపీ అభ్యర్థులుగా పంతం వెంకట గజేంద్రరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా యండీ దాదా సాహెబ్, యండీ రహీ మున్నీసా బేగం నామినేషన్‌లు దాఖలు చేశారు. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు, నూజివీడు నియోజకవర్గానికి ఎనిమిది, గన్నవరంకు ఏడు, గుడివాడకు ఏడు, కైకలూరుకు ఐదు, పెడనకు పది, అవనిగడ్డకు ఎనిమిది, పామర్రుకు రెండు, పెనమలూరుకు ఆరు, విజయవాడ వెస్ట్‌కు ఆరు, విజయవాడ సెంట్రల్‌కు 15, విజయవాడ ఈస్ట్‌కు ఆరు, మైలవరంకు నాలుగు, నందిగామకు రెండు, జగ్గయ్యపేటకు 11 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.