కృష్ణ

ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : కృష్ణా-గుంటూరు జిల్లా పట్ట్భద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన పోలింగ్ అంతంత మాత్రంగానే జరిగింది. కృష్ణాజిల్లాకు సంబంధించి పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. లక్షా 6వేల 829 మంది పట్ట్భద్ర ఓటర్లకు గాను 64వేల 489 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 60.37 శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. జిల్లాలో మొత్తం 153 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించటంతో జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. పట్టణంలోని హైనీ హైస్కూల్, సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 4గంటల వరకు ఓటు వేసేందుకు లైన్‌లో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో చాలా పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరిగింది. పోటీలో ఉన్న 40 మంది అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఓటర్లకు సూచనలు చేశారు.

అట్టహాసంగా ‘ఆర్‌కే’ నామినేషన్

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, : మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బండి రామకృష్ణ (ఆర్‌కె) నామినేషన్ కార్యక్రమానికి జన సైనికులు కదం తొక్కారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి వేలాది మంది జనసైనికులు బండి రామకృష్ణ నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చారు. సుల్తానగరంలోని అభయాంజనేయ స్వామి ఆలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ కటౌట్‌తో ఊరేగింపు నిర్వహించారు. రామకృష్ణతో పాటు పార్లమెంట్ అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణ, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, సీపీఐ నాయకులు మోదుమూడి రామారావు, బహుజన సమాజ్ వాది పార్టీ నాయకులు జయకర్ బాబు తదితరులు ఆర్‌కె నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

పెడనలో పోటా పోటీగా జన సమీకరణ

పెడన, 2: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను వైకాపా నుంచి జోగి రమేష్, టీడీపీ నుంచి కాగిత వెంకట కృష్ణప్రసాద్ తమ నామినేషన్లను శుక్రవారం దాఖలు చేశారు. ఉదయం 11.30 గంటలకు కృష్ణప్రసాద్, 12.06ని.లకు జోగి రమేష్ నామినేషన్లు రిటర్నింగ్ అధికారి, ముడా వైస్ చైర్మన్ పి విల్సన్ బాబుకు అందచేశారు. అనంతరం ఇద్దరు నాయకులు వేర్వేరుగా విలేఖర్లతో మాట్లాడుతూ తమదే విజయమని చెప్పారు. వీరి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి పోటా పోటీగా జన సమీకరణ చేశారు. గుడివాడ, బందరు రోడ్డు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎస్‌ఐలతో పాటు బందరు రూరల్ ఎస్‌ఐ రవి కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. వీరితో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్‌వి రాజు కూడా నామినేషన్ దాఖలు చేశారు.

పొమ్మనకుండా పొగ పెడుతున్నారు

వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్ష పదవికి కాజా రాజీనామా?

మైలవరం, : వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన అనుచరుల వద్ద తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలిసింది. గతంలో తెలుగుదేశం పార్టీలో చురుకైన నేతగా ఎదిగిన కాజా రాజ్‌కుమార్ అటు పిమ్మట వైసీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడికి చెందిన రాజ్‌కుమార్ విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చిన రాజ్‌కుమార్ అప్పటి నుండి పార్టీలో చురుకైన నేతగా కొనసాగుతున్నారు. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి తరపున మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పని చేశారు. అప్పటి మైలవరం అసెంబ్లీ అభ్యర్థి జోగి రమేష్‌కు కాజాకు అంతర్గత విబేధాలు ఉండటం, వీరి మధ్య ఆ ఎన్నికలలో సఖ్యత లేకపోవటంతో జోగి ఆ ఎన్నికలలో ఓటమి చెందటం వంటి కారణాల నేపధ్యంలో కాజాపై జగన్‌కు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. నియోజకవర్గంలో కాజా, జోగి వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహించారు కూడా. నియోజకవర్గంలోని దాదాపు అన్ని ఎస్సీ కాలనీలలో చర్చిల నిర్మాణం, చర్చిల పునః నిర్మాణం, ఆసుపత్రులలో రోగులకు ఆర్థిక సాయం, నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆర్థిక సాయం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించటం ద్వారా బలహీన వర్గాలలో పేరు సంపాదించారు. జోగి రమేష్ ఇక్కడి నుండి పెడన ఇన్‌చార్జ్‌గా వెళ్ళటం, ఇక్కడికి నందిగామకు చెందిన వసంత కృష్ణ ప్రసాద్ రాకతో వీరిరువురూ కలసి పార్టీలో పని చేస్తారని అందరూ ఊహించారు. కృష్ణ ప్రసాద్‌కు దగ్గర బంధువైన (సోదరుని వరుస) రాజ్‌కుమార్ మళ్ళీ కేపీని వ్యతిరేకించారు. వీరిరువురూ ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరిస్తున్నారు. అయనప్పటికీ సంబంధం లేని విషయాలను తనకు ఆపాదిస్తూ తనపై ద్వేషం పెంచుకుంటున్నాడంటూ కేపీ వాపోతున్నారు. పార్టీలో జరిగే కార్యక్రమాలకు తనను ఆహ్వానించకుండా మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాడని తాను ఇక కలిసేది లేదంటూ కాజా తేల్చేస్తున్నారు. కాజా నిర్ణయాన్ని కేపీ మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు గానీ అధికార టీడీపీ మాత్రం లోలోన సంబరపడుతోంది. గొల్లపూడి తెలుగుదేశం ఎంపిటిసి నూతులపాటి బాలకోటేశ్వరరావు ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలో దిగటంతో ఆయన ద్వారా జరిగే నష్టం కాజా ద్వారా పూడ్చుకోవచ్చని తెలుగుదేశం నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.