కృష్ణ

రాజధానిలో కూర్చుని రాజకీయాలు చేస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: కేసీఆర్ సాయంతో హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్ లాంటి వాడిని తాను కాదని మంగళగిరి నడిబొడ్డున కూర్చోని రాజకీయాలు నడుపుతున్న వ్యక్తిని తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం రాత్రి అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రతిపక్ష నేత జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన మార్పు తీసుకువస్తామన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామన్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. లేకుంటే జనసైనికుల ఆగ్రహానికి విజయసాయిరెడ్డి ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. రూ.2500కోట్లు దోపిడికి పాల్పడిన చంద్రబాబుతో జనసేన ఎందుకు చీకటి ఒప్పందం పెట్టుకుంటుందన్నారు. తమకంటూ ఒక అజెండా ఉందని, ఆ అజెండా ప్రకారమే జనసేన ముందుకు వెళుతుందన్నారు. రాజధాని పేరుతో అడ్డగోలుగా భూములను దోచుకున్నారన్నారు. పేదలకు సరైన వైద్యం అందించని పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందన్నారు. వీటన్నింటికీ పరిష్కారం లభించాలంటే జనసేన అధికారంలోకి రావల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణ, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ముత్తంశెట్టి కృష్ణారావు, జనసేన నాయకురాలు ముత్తంశెట్టి విజయ నిర్మల, జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాలరావు పాల్గొన్నారు.