కృష్ణ

బందరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా అంజిబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గుడివాక అంజిబాబు ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఏప్రిల్ 11వతేదీన జరగనున్న ఎన్నికల్లో ఆయన బందరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయనున్నారు. పార్టీ ఆదేశాల మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పార్టీ శ్రేణులు వేలాదిగా అంజిబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. దివిసీమ ప్రాంతానికి చెందిన అంజిబాబు ప్రజా సమస్యల పరిష్కారంలో తొలి నుండి పోరాటాలు చేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్‌గా ఏడేళ్లు ఉద్యోగ సేవలు అందించిన ఆయన ప్రజా సేవ చేసేందుకు గడిచిన నాలుగేళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. సోమవారం ఉదయం 8గంటలకు నాగాయలంక నుండి వేలాది మంది కార్యకర్తలతో అంజిబాబు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు.

ఆర్యవైశ్యులకు అండగా ఉంటా

మైలవరం, మార్చి 24: ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మైలవరం వైకాపా అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కేపీ) అన్నారు. స్థానిక చలవాది కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో కేపీ మాట్లాడుతూ తనదీ వ్యాపార కుటుంబమేనని, గడచిన 27 ఏళ్ళుగా నీతి, నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానని మీ సమస్యలు, బాధలు తెలుసునని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత మీదేనని, మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన చరిత్ర మీదేనన్నారు. సేవకు పెట్టింది పేరు మీరేనని, దాతృత్వానికి మీకెవరూ సాటిరారన్నారు. ప్రత్యర్థికిలాగా దిగజారుడు రాజకీయాలు చేయనని, చంద్రబాబు 600 హామీలిచ్చి వాటిలో ఆరు కూడా అమలు చేయలేదని ఆరోపించారు. మంత్రి ఉమ రెండు సార్లు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి మోసం చేశారన్నారు. ఎన్నికలపుడే కాకుండా ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. హోం శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. వైఎస్ హయాంలోనే కె రోశయ్య ఆర్థిక మంత్రి అయ్యారని, తర్వాత సీఎం అయ్యారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించటం జరుగుతుందన్నారు.