కృష్ణ

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధిగా తనను గెలిపిస్తే జగ్గయ్యపేటకు పాసింజరు రైలును తేవడమే కాక నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ యువజన విభాగం కార్యాలయంలో ముఖ్య నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లు, బూత్ కన్వీనర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ పదిహేను రోజులు పార్టీ కోసం, తన కోసం కష్టపడితే ఐదు సంవత్సరాల పాటు తాను వారి కోసం కష్టపడుతూ అండగా ఉంటానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు కేసులతో భ్రష్టు పట్టించారు

మచిలీపట్నం, మార్చి 24: అధికార బలంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర గడిచిన ఐదేళ్లలో తనపై నాలుగు తప్పుడు కేసులు పెట్టి తనను భ్రష్టుపట్టించాలని ప్రయత్నించారని ప్రభుత్వ మాజీ విప్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బందరు నియోజకవర్గ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య ఆరోపించారు. తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి రవీంద్ర తనపై పెట్టిన నాలుగు కేసుల్లో రెండు కేసులు తప్పుడు కేసులని పేర్కొంటూ న్యాయమూర్తి కొట్టి వేశారని తెలిపారు. మరో రెండు కేసులు కూడా నిరాధారమైనవన్నారు. ఇందులో ప్రధానంగా 2015 నవంబర్ 13న ఎక్సైజ్ అధికారులపై దాడి చేశానని తనమీద, తనతో రాజకీయ ప్రయాణం చేస్తున్న వ్యక్తులపై నాడు ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర తనపై తప్పుడు కేసు పెట్టారని ఈ కేసును ఈ నెల 6వ తేదీన న్యాయమూర్తి కొట్టి వేశారన్నారు. కొట్టి వేసిన రెండు కేసులకు సంబంధించిన ఛార్జ్‌షీట్ వేయడానికి పోలీసులకు మూడున్నర సంవత్సరాలు పట్టిందన్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరితో కలిసి తాను సోమవారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్ దాదా తదితరులు పాల్గొన్నారు.