కృష్ణ

ఒకే ఒక్క రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం నేటితో పరిసమాప్తం కానుంది. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. సెలవు రోజులైన శని, ఆదివారాలు మినహా ఈ ఐదు రోజుల్లో జిల్లా మొత్తం 263 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 26, 16 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 217 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన సోమవారం అత్యధికంగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ కన్నా ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేసిన వారి సంఖ్యే అధికం. ఈ మూడు రోజుల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేసిన వారితో మంతనాలు జరిపి వారి నామినేషన్లు ఉప సంహరించుకునేలా తెర వెనుక ప్రయత్నాలకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి.

నేటితో నామినేషన్ల గడువు పూర్తి

గుడివాడ, మార్చి 24: ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుందని గుడివాడ ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి జీవీ సత్యవాణి చెప్పారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆమె విలేఖర్లతో ఆదివారం మాట్లాడారు. సాయంత్రం 3గంటల లోపు మాత్రమే నామినేషన్లను దాఖలు చేసే అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయ పరిధిలో 100 మీటర్ల లోపు చేరుకున్న అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. సోషల్ మీడియాలో చేసే ప్రచారాలకు కూడా ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయని ఆమె తెలిపారు.