కృష్ణ

అక్కరకు రాని ‘ఆపద్బంధు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 27: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవల్సిన ఆపద్బంధు పథకం అక్కరకు రావడం లేదు. నిధుల కొరత కారణంగా ప్రభుత్వ సాయం అందని పరిస్థితి జిల్లాలో నెలకొంది. గత రెండేళ్ళుగా ఆపద్బంధు పథకానికి సంబంధించిన బడ్జెట్ విడుదల కాపోవటంతో బాధితులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. నిధుల కొరత కారణంగా జిల్లాలో మొత్తం 130 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరంతా ప్రభుత్వ సాయం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కుటుంబ యజమాని ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద రూ.50వేలు మంజూరు చేస్తోంది. ఇది కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అటువంటి కుటుంబాలు ఇంటి యజమాని లేక వీధి పాలు కాకూడదన్న ప్రధాన ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆపద్బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు, ప్రమాదం జరిగిన తీరును మండల తహశీల్దార్లకు తెలియజేయాలి. దీనిపై విచారణ నిర్వహించిన తహశీల్దార్ సంబంధిత కేసులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతారు. నిధులు విడుదలైనప్పుడు ప్రాధాన్యతను బట్టి మంజూరు చేస్తారు. గతంలో ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఈ సాయాన్ని ప్రభుత్వం అందచేసేది. ఆ తర్వాత ప్రభుత్వమే నేరుగా ఆపద్బంధు పథకం కింద రూ.50వేలు మంజూరు చేస్తోంది. అయితే నిధుల కొరత, బడ్జెట్ విడుదల కాకపోవటంతో జిల్లాలో గడిచిన రెండేళ్ళల్లో 130 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది 50 కేసులు పెండింగ్‌లో ఉండగా ఈ ఏడాది మరో 80 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది మొత్తం 232 మంది ప్రమాదవశాత్తు మృతి చెందగా అందరికీ ఆపద్బంధు పథకం వర్తింప చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వీరిలో 182 మందికి రూ.50వేలు చొప్పున పరిహారం అందించగా మరో 50 మందికి నిధుల కొరత కారణంగా అందించలేదు. దీంతో వారంతా తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.