కృష్ణ

ఈవీఎంల భద్రతపై అనుమానాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఇవీఎంల భద్రతపై ఎటువంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని జిల్లా ఎన్నకల అధికారి, కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేపట్టిన భద్రతా చర్యలను ఆదివారం ఆయన అభ్యర్థులు, వారి ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రిజర్వ్ ఇవీఎంలు ఎవరికీ తెలియకుండా కృష్ణా విశ్వ విద్యాలయం నుండి మచిలీపట్నంలోని మార్కెట్ యార్డ్‌కు శనివారం సాయంత్రం తరలించారని వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. స్ట్రాంగ్ రూమ్ పక్కన ఉంచిన రిజర్వ్ ఇవీఎంలను అభ్యర్థులకు సమాచారం ఇచ్చి వారి సమ్మతితోనే వీటిని బందోబస్తు మధ్య తరలించడం జరిగిందని కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయన నూజివీడు అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర నియోజకవర్గ అభ్యర్థులు, వారి ప్రతినిధులతో కలిసి స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించి అక్కడ చేపట్టిన భద్రతా చర్యలను వారికి వివరించారు. పోలింగ్ ముగిసిన అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లకు ఇవీఎంలు చేరిన వెంటనే అభ్యర్థుల సమక్షంలో సీల్ వేయడం జరిగిందన్నారు. మూడంచెల భద్రతల మధ్య వీటిని భద్రపరిచామన్నారు. కృష్ణా వర్సిటీలో 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించుకునే విధంగా అభ్యర్థులకు విశ్వ విద్యాలయం ఆవరణలో ప్రత్యేక రూమును ఏర్పాటు చేశామన్నారు. మూడంచెల భద్రతతోపాటు కేంద్ర ప్రభుత్వ బలగాలు, ఏపీ స్పెషల్ పోలీస్, జిల్లా పోలీస్‌తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లకు 100 మీటర్ల దూరం వరకు నిషిద్ధ ప్రాంతంగా గుర్తించి ఏ ఒక్కరినీ అనుమతించడం లేదన్నారు. కృష్ణా వర్సిటీ లే అవుట్‌తో పాటు భద్రత ఏర్పాట్లు అభ్యర్థులు, వారి ఏజెంట్లకు తెలిసే విధంగా వర్శిటీ ఆవరణలో ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నల్ దినకర్, అభ్యర్థులు మేకా ప్రతాప్ అప్పారావు, బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ తదితరులు ఉన్నారు.