కృష్ణ

సద్దుమణగని ‘ఈవీఎం’ల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఈవీఎంల తరలింపు వివాదం సద్దుమణగలేదు. మూడు రోజుల క్రితం కృష్ణా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచి ఈవీఎంలను తరలించారన్న ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ నిజనిర్ధారణ చేసి కమిషన్‌కు నివేదిక పంపినప్పటికీ కమిషన్ శాంతించలేదు. తరలించిన రిజర్వు ఈవీఎంలు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవి కావటంతో మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రంగంలోకి దిగారు. కృష్ణా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద జిల్లా అధికారులు చేపట్టిన భద్రతా చర్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈవీఎంల తరలింపునకు సంబంధించి వివరాల్లోకి వెళితే గత శనివారం రాత్రి 10గంటల సమయంలో కృష్ణా విశ్వవిద్యాలయం స్ట్రాంగ్ రూమ్ పక్కన స్టోర్ చేసిన రిజర్వు ఈవీఎంలను నూజివీడు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో మార్కెట్ యార్డు గోడౌన్‌కు తరలించారు. అయితే తరలింపు విషయమై అభ్యర్థులకు సమాచారం లేకపోవటంతో వివాదాస్పదమైంది. అధికారులు మాత్రం తాము ముందస్తు సమాచారం ఇచ్చే తరలించామని చెబుతున్నారు. దీనిపై గత రెండు రోజులుగా రాజకీయ దుమారం రేగుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగంపై ఎన్నికల సంఘం గుర్రుగా ఉంది. ఈ వివాదంపై నిజనిర్ధారణ నిమిత్తం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మరుసటి రోజే అభ్యర్థులను స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. కేవలం రిజర్వు ఈవీఎంలను మాత్రమే తరలించామని, ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేదని చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈవీఎంల తరలింపు అంశంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న మరికొన్ని అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో భాగంగానే మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా రిటర్నింగ్ అధికారి, ఆ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మచిలీపట్నం వచ్చి కృష్ణా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించి వెళ్లడం విశేషం.