కృష్ణ

సకాలంలో ‘పది’ మూల్యాంకనం పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సకాలంలో పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని కాకినాడ ఆర్‌జెడీ డి దేవానందరెడ్డి ఆదేశించారు. స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో గత మూడు రోజులుగా కొనసాగుతున్న పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంను బుధవారం ఆయన పరిశీలించారు. క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి మూల్యాంకనం జరుగుతున్న తీరును ఆర్‌జెడీకి వివరించారు. జిల్లాకు మొత్తం 5లక్షల 23వేల 880 సమాధాన పత్రాలు మూల్యాంకనం నిమిత్తం వచ్చినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటి వరకు 99వేల 98 సమాధాన పత్రాల మూల్యాంకనం జరిగిందని తెలిపారు. ఈ నెల 27వతేదీ లోపు నూరు శాతం మూల్యాంకనం చేయనున్నట్లు తెలిపారు. బుధవారం 252 మంది స్పెషల్ అసిస్టెంట్లు, 150 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 883 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన విధుల్లో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఇఓలు బి సత్యనారాయణ మూర్తి, కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి సరఫరాలో ఇబ్బందులు రానివ్వొద్దు

మచిలీపట్నం(కోనేరుసెంటర్), ఏప్రిల్ 17: బందరు మండలం చిట్టిపాలెం గ్రామంలో వాటర్ పంపింగ్ హౌస్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన పంపింగ్ మోటార్లను బుధవారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. తక్షణం మరమ్మతు చర్యలు చేపట్టి ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు మంత్రి రవీంద్ర సూచించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, ఎఎంసీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, టీడీపీ బందరు మండల అధ్యక్షుడు కుంచే దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు.