కృష్ణ

కార్యకర్తల త్యాగాలే పార్టీకి కొండంత బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ఇటీవల జరిగిన ఎన్నికలలో కార్యకర్తల త్యాగాలను మరువలేమని వారి కష్టం పార్టీకి కొండంత అండ అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మైలవరం మండల పార్టీ కార్యకర్తల సమావేశం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి జరిగింది. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు పడిన శ్రమ, చేసిన కృషిని మర్చిపోలేనని, తాను బతికున్నంత వరకూ వారికి సేవ చేస్తానని ప్రకటించారు. తాను, ఎంపి మాత్రమే గెలవటం కాదని, రాబోయే స్థానిక ఎన్నికలలో మన పార్టీ తరపున బరిలో ఉన్న ప్రతి ఒక్కరూ గెలవాలని అప్పుడే తనకు తృప్తి ఉంటుందన్నారు. గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. తనను ఓడించటానికి 2014లో కులం కార్డును ఉపయోగించారని, 2019లో డబ్బు సంచులతో రంగంలో దిగారని ఎన్నికలు రెండు రోజులు ముందుగానే దుకాణం కట్టేశారని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా మైలవరం ఓటర్లు తెలుగుదేశం వైపే ఉన్నారని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించటానికి కార్యకర్తలు, నాయకులు, మహిళలు కసిగా అర్థరాత్రి వరకూ క్యూలో ఉండి ఓటు వేశారని గుర్తు చేశారు. జిల్లాలో 16 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందన్నారు. రాష్ట్రంలో 150 పైగా అసెంబ్లీ స్థానాలను సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు మంత్రి ఉమ ధీమా వ్యక్తం చేశారు. కానీ జగన్ మాత్రం సీఎం పిచ్చిలో పడి కొట్టుకుంటున్నాడని విమర్శించారు. ఫలితాల అనంతర జగన్ లోటస్ పాండ్‌కే పరిమితం కానున్నాడన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ది గురించి మాట్లాడుకోవాలన్నారు. ఇప్పటి వరకూ ఎంతో అభివృద్ధి చేశామని మిగిలిన అభివృద్ధిని పూర్తి చేయటానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యకర్తలు, నాయకులు చేయాల్సిన అభివృద్ధిని గుర్తించి తనకు తెలియజేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా, ప్రాధాన్యతాక్రమంలో వాటిని పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య రాకుండా కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణాజలాలు అన్ని గ్రామాలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తరిమి కొట్టాలని, రాబోయే స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకునేందుకు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. తన గెలుపునకు పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.