కృష్ణ

‘స్థానిక’ పోరుకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : ‘స్థానిక’ పోరుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల ఘట్టం పూర్తి కాక ముందే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాక చర్యలను ప్రారంభించింది. తొలిగా గత పది నెలలుగా ఇన్‌ఛార్జ్ పాలనలో సాగుతున్న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారా..? లేదా జూన్ 2వతేదీతో ముగియనున్న పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇందుకు గాను ఓటర్ల జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాక ముందే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వేడిలో వేడిగా అన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే మే 23వతేదీన ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలోనే స్థానిక సంస్థల పోరు జరగనుంది. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీలకు సంబంధించి పాలకవర్గాల పదవీ కాలం గత సంవత్సరం జూలై నెలాఖరుతో ముగిసింది. నాటి నుండి నేటి వరకు పంచాయతీల పాలకవర్గాల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో ఆశించిన స్థాయి ప్రగతి లేదనే చెప్పాలి. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి పంచాయతీల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం మొగ్గు చూపటం ఓ శుభ పరిణామంగా పేర్కొనవచ్చు. 970 గ్రామ పంచాయతీలకు గాను కృత్తివెన్ను మండలం చినపాండ్రాక గ్రామ పంచాయతీ మినహా మిగిలిన 969 గ్రామ పంచాయతీలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. చినపాండ్రాక గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీ కాలం ఇంకా రెండు నెలల పాటు ఉంది. దీంతో ఆ పంచాయతీ మినహా మిగిలిన అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీని మార్చి 10వతేదీతో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు చర్యలు ప్రారంభించారు. అలాగే పురపాలక సంఘాల ఎన్నికలకు కూడా సమయం ముంచుకొస్తోంది. జూన్ 2వ తేదీతో ప్రస్తుతం ఉన్న పురపాలక సంఘాల పదవీ కాలం ముగియనుంది. ఇందుకు సంబంధించి మే 1వతేదీనే ఓటర్ల జాబితా తయారీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పురపాలక సంఘాల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసే పనిలో అధికారులు తలమునకలయ్యారు. అలాగే వార్డుల వారీ రిజర్వేషన్‌ల కేటాయింపుపై కూడా దృష్టి సారించారు. జిల్లాలో విజయవాడ నగర పాలక సంస్థతో పాటు మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట పురపాలక సంఘాలు, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నాయి. అయితే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో మచిలీపట్నం పురపాలక సంఘానికి కార్పొరేషన్ హోదా కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పాలకవర్గం ఉన్న సమయంలో కార్పొరేషన్ హోదా ఇవ్వలేమని, పాలకవర్గం పదవీ కాలం ముగిసిన తర్వాత కార్పొరేషన్ హోదా లభిస్తుందని ఆ తర్వాత కొద్దిపాటి సవరణతో జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీని బట్టి మచిలీపట్నం పురపాలక సంఘంకు ఈ విడత కార్పొరేషన్ హోదాలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 42 మున్సిపల్ వార్డులను 50 డివిజన్‌లుగా మార్చనున్నారు. పురపాలక సంఘానికి అనుకుని ఉన్న పోతేపల్లి, మేకావానిపాలెం, సుల్తానగరం గ్రామ పంచాయతీలను పురపాలక సంఘంలో విలీనం చేసి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తారన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అదే జరిగితే జిల్లాలో ఉన్న 970 గ్రామ పంచాయతీలు కాస్త 967 కానున్నాయి. ఏది ఏమైనా స్థానిక పోరు మరో సార్వత్రిక ఎన్నికల సంగ్రామాన్ని తలపించే అవకాశాలు లేకపోలేదు.