కృష్ణ

ఆహారంగా అడవి జంతువులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, : మండలంలో వన్యప్రాణుల వేట యధేచ్చగా కొనసాగుతోంది. ప్రతి యేడాది వేసవి కాలంలో వన్యప్రాణులు దాహార్తి తీర్చుకోవడానికి అడవిని విడిచి గ్రామ పరిసరాల్లోకి వస్తుంటాయ. ఇదే అదనుగా భావించిన వేటగాళ్ళు ఉచ్చులను అమర్చి అడవి జంతువులను సంహరిస్తున్నారు. జి.కొండూరు మండలంలో మైలవరం, విజయవాడ రేంజ్ ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ కొంతమంది అటవీ శాఖాధికారులు కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్నారు. వేటగాళ్ళ ఉచ్చులకు చిక్కి మూగజీవాలు మరణిస్తున్నాయి. అడవి పందులు, లేళ్లు, దుప్పులు, కణుజులు, ఉడుములు, ముళ్ళపందులు, అలగలు, కుందేళ్ళు, ఇతర పశుపక్షాదులు, వన్యజీవులు ప్రతి రోజూ మరణిస్తూనే ఉన్నాయి. ముందుగానే వేటగాళ్ళు నీటి నిల్వలు ఉన్న చోట్ల ఉచ్చులను బిగిస్తారు. నీటి కోసం వచ్చే వన్యప్రాణులు ఉచ్చుల్లో పడి చనిపోతున్నాయి. వేటాడే కుక్కలను రాత్రి సమయాల్లో తీసుకెళ్ళి కూడా వేటను కొనసాగించడం ఇక్కడ ఆనవాయితీ. వేటను వృత్తిగా చేసుకుని జీవించే కుటుంబాలు అనేకం మండల పరిధిలో ఉన్నాయి. అడవి జంతువుల మాంసం కిలో రూ.500లకు పైనే ధర ఉండటంతో పాటు, మార్కెటింగ్‌కు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఇక అడవి జంతువుల మాంసానికి ఉన్న డిమాండ్‌ను బట్టి అటవీ శాఖ ఉద్యోగులలో కొందరికి బాగానే ముడుపులు ముడుతున్నట్లు తెలిసింది. ఇదంతా బహిరంగ రహస్యమే. వన్యపాణ్రుల వేట గురించి ఎవరైనా సమాచారం ఇచ్చినా అధికారులే వేటగాళ్ళకు తిరిగి సమాచారం ఇచ్చి వాళ్ళను అప్రమత్తం చేసి మొక్కుబడి దాడులు నిర్వహిస్తారని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లా అటవీ శాఖాధికారులు దీనిపై ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి వన్యప్రాణులను రక్షించాల్సి ఉంది.