కృష్ణ

కన్నీరు తెప్పిస్తున్న కూరల ధరలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: ఎండలు విపరీతంగా పెరగటంతోపాటు నీటి ఎద్దడి కారణంగా కూరగాయల ధరలు చెట్టెక్కి కూర్చున్నాయ. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందడం లేదు... విపణిలో మాత్రం ధరాఘాతంతో వినియోగదారుల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు వేసవి సాకుతో కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. సాధారణంగా కొన్ని కూరగాయలు, ఆకుకూరలు ధరలు మాత్రమే పెరిగాయి. ఇదే అదనుగా భావించి వ్యాపారులు తమ ఇష్టానుసారం ధరలు పెంచేసి విక్రయస్తున్నారు. ‘మరీ ఇంత దారుణమా’ అని ప్రశ్నించిన వారికి మాత్రం దిగుబడి తగ్గిపోయిందని, సరుకు రావడం లేదని చెప్పుకొస్తున్నారు. జి.కొండూరులో చాలావరకు కూరగాయలు స్థానికంగా పండిస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ, రైతుబజారు లేని కారణంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు అమ్ముకుంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు కూరగాయలను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ఏడాది పచ్చడి టమాటాలు కిలో రూ. 20 అమ్మగా నేడు సాధారణ టమాటాలే మంగళవారం నాటికి కిలో ధర రూ. 40కి పెరిగింది. పది రోజుల క్రితం కిలో టమాటా రూ. 25లకే అమ్మారు. పచ్చిమిర్చి కిలో రూ. 30 నుండి రూ. 40కి పెరిగింది. బజ్జిమిర్చి రెండు రకాలు కిలో రూ. 35 నుండి రూ. 60కి, రూ. 60 నుండి రూ. 75కి పెరిగాయి. క్యాబేజీ రూ. 20 నుండి 30కి, క్యారెట్ రూ. 35 నుండి రూ. 45కి, బీట్‌రూట్ రూ. 24 నుండి 30కి ధరలు పెరిగాయి. ఫ్రెంచ్ బీన్స్ కిలో రూ. 95 నుండి రూ. 110కి, బంగాళదుంపలు కిలో రూ. 18నుండి రూ. 20కి చేరాయి. అల్లం కూడా పది రోజుల్లో కిలో రూ. 94 నుండి రూ. 105కి, వెల్లుల్లి కిలో రూ. 65 నుండి 80కి ధరలు పెరిగాయి. నాటు చిక్కళ్లు కిలో రూ. 48 నుండి రూ. 60కి పెరిగాయి. నిరుపేదలు కూరగాయలు కొనలేక ఉల్లికారం, పచ్చళ్ళు, పచ్చిపులుసులతోనే సరిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా కూరగాయలు, ఆకుకూరల ధరల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.