కృష్ణ

ఆశ వర్కర్ల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వని పక్షంలో ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ (ఆశ) యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ కమల హెచ్చరించారు. ఆశ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఆశ కార్యకర్తల జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు. గౌరవ వేతనం, పారితోషకాలను సర్క్యులర్ ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.3వేలు గౌరవ వేతనం, రూ.5600లు పారితోషకాలు చెల్లించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ ఆ విధంగా చెల్లింపులు జరగడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా రూ.8600లు పారితోషకాల సర్క్యులర్‌ను పరిగణలోకి తీసుకుని చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమస్యల సాధనకై ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లా అధ్యక్షురాలు వై నాగలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి ధనశ్రీ, సీఐటీయు పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి
నాగాయలంక, ఏప్రిల్ 22: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎంపీడీఓ బి శ్రీనివాసరావు కోరారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మే 23వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామాలలో ఎట్టి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ కార్యక్రమాలను చేపట్టరాదన్నారు. స్థానిక సంస్థలకు చెందిన ఎంపీటీసీ సభ్యుల కోరిక మేరకు ఆయా గ్రామాలలో మంచినీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్యం వంటి సమస్యలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశానికి ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. సమావేశంలో పాల్గొన్న వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామాలలోని జలాశయాలలో నీరు తగ్గు ముఖం పట్టిందని, వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యకు గ్రామీణ నీటి సరఫరా అధికారి రత్నారావు మాట్లాడుతూ గ్రామాలలోని చెరువులలో ఉన్న నీరు మరో 15 రోజులు వస్తాయని తెలిపారు. ఈ నీటి నిల్వలు తగ్గు ముఖం పట్టే సమయానికి కాలువ ఎగువ ప్రాంతంలో నీటి సౌలభ్యతను బట్టి కొద్ది రోజులు పాటు పంట కాలువల ద్వారా మంచినీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసే విధంగా కృషి చేయాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీఓను కోరారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.