కృష్ణ

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకై గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ వివరాలను సోమవారం ఆయన పత్రికా ముఖంగా విడుదల చేశారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన చర్యలను పోలీసు సిబ్బందికి వివరించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. సీటుబెల్టు, హెల్మెట్ ధరించిన వాహనాలు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అతివేగంగా వాహనం నడిపేవారిని గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. యువత ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్‌లను కట్టడి చేయాలన్నారు. గ్రామాల్లో సభలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. గత వారం రోజులుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 3,450 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. జరిమానాలు కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని భావించి ఆడియో, వీడియోల రూపంలో జిల్లాలో ప్రమాదాలు, దొంగతనాలు, వివిధ రకాల నేరాలకు సంబంధించి ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. బందరు సబ్ డివిజన్‌లో920, గుడివాడ సబ్ డివిజన్‌లో 652, నూజివీడు సబ్ డివిజన్‌లో 758, నందిగామ సబ్ డివిజన్‌లో 605, అవనిగడ్డ సబ్ డివిజన్‌లో515 మంది నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ వేగం కన్నా ప్రాణం మిన్న అనే సత్యాన్ని గ్రహించి జాగ్రత్తగా వాసనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ఎస్పీ త్రిపాఠి సూచించారు.