కృష్ణ

సమస్యలతో వచ్చేవారికి న్యాయం చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసు శాఖ పని చేస్తోందని జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి సమస్యలపై వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యల నిమిత్తం ఆయా పోలీసు స్టేషన్ అధికారులను ఆదేశించారు. కొన్ని సమస్యలకు అక్కడిక్కడే పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాదివస్ ద్వారా వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు.
ముగిసిన శ్రీ లక్ష్మీపతి స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు
కూచిపూడి, ఏప్రిల్ 22: పంచలక్ష్మీ నారాయణ క్షేత్రమైన పెదముత్తేవి గ్రామంలో స్వయంభూవుగా వెలసిన శ్రీ లక్ష్మీపతి స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం తేరు రథోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవ, కమల దంపతులు స్వామివారి రథోత్సవానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. విద్యుత్ దీపకాంతులతో అలంకృత తేరు రథంపై శ్రీ భూ, నీలా సమేతుడైన లక్ష్మీపతి స్వామివారు గ్రామంలో భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా రథోత్సవానికి గడపగడపన కర్పూర నీరాజనాలు అందించారు. ఆలయ పర్యవేక్షకులు తుర్లపాటి ఆనందసాగర్ భక్తులకు తీర్ధప్రసాద వినియోగం చేశారు.