కృష్ణ

‘తొమ్మిది’ మెరుగైన ఫలితమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ‘పది’లో తొమ్మిది మెరుగైన ఫలితమేనని జిల్లా విద్యాశాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి అన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి విచ్చేసిన ఆమె పదవ తరగతి పరీక్షా ఫలితాలపై స్పందించారు. రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా 93.96 శాతం ఉత్తీర్ణతతో తొమ్మిదవ స్థానంలో నిలవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితం శాస్ర్తియమైనదన్నారు. ఫలితాల పట్ల జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా కూడా విద్యా శాఖను అభినందించారన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ తీరు అభినందనీయమన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం వల్లే ఈ ఫలితం వచ్చిందన్నారు. ఎక్కడా కూడా మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించలేదన్నారు. అదే చేస్తే ర్యాంకింగ్‌లో ముందుండే వారన్నారు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తే నాశనమయ్యేదన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండి విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచటంతో పాటు ఉపాధ్యాయుల బోధనా సామర్ధ్యాన్ని మెరుగుపరిచామన్నారు. నాణ్యతతో కూడిన ఫలితం కోసం చేసిన కృషి ఫలించిందన్నారు. గత మూడేళ్లుగా కూడా జిల్లా తొమ్మిదవ స్థానంలోనే నిలుస్తూ వచ్చిందన్నారు. రానున్న విద్యా సంవత్సరం ఫలితాల్లో మరింత మెరుగుదల సాధించేందుకు ఇప్పటి నుండే కృషి చేస్తామన్నారు. తొలుత పామర్రు ఉషోదయలో 10/10 జీపీఎ సాధించిన ఆరుగురు విద్యార్థులను ఆమె అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించి భవిష్యత్తు విద్యా ప్రణాళికపై కొద్దిమేర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బందరు డీవైఇఓ బి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.