కృష్ణ

కళాలోకాన్ని మైమరిపింప చేసిన సంకీర్తన నాట్య మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళావేదికపై శనివారం ఏర్పాటు చేసిన సంకీర్తన నాట్య మహోత్సవం కళాలోకాన్ని మైమరపింప చేశాయి. అన్నమాచార్యుల 611వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సంకీర్తన నాట్య మహోత్సవాలు సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన డా. చింతా ఆది నారాయణ శిష్య బృందం అదిగో.. అల్లదిగో అనే అంశాన్ని, తెనాలికి చెందిన జి నిర్మల రమేష్ బృందం అన్ని మంత్రములు యందే.., ఈతడే రఘురాముడు అనే అంశాలను, కైకలూరుకు చెందిన కూచిపూడి నాట్య రవళి శిష్య బృందం కలశాపురముకాడ అనే అంశాన్ని, గుంటూరుకు చెందిన షేక్ ఖలీల్ శిష్య బృందం కొండలలో నెలకొన్న.., తిరుతిరు జవరాల అనే అంశాలను, ఏలూరుకు చెందిన పార్వతి రామచంద్రన్ శిష్య బృందం దేవదేవంభజే.. అనే అంశాన్ని, కంకిపాడుకు చెందిన మువ్వ వేణుగోపాల కల్చరల్ ఆర్ట్స్ అకాడమికి చెందిన బృందం భావములోన అనే అంశాన్ని, కూచిపూడి గ్రామానికి చెందిన బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత డా. చింతా రవి బాలకృష్ణ శిష్య బృందం వందే వాసుదేవం అనే అంశాన్ని, తణుకుకు చెందిన అంబిక శిష్య బృందం వీధుల వీధుల విబుడితే అనే అంశాలను, హైదరాబాద్‌కు చెందిన రాధాకృష్ణ కూచిపూడి నాట్యాలయం బృందం పుష్పయాగం అనే అంశాన్ని, మనోజ శిష్య బృందం అలరులు కురియగ ఆడినదే అనే అంశాన్ని, రేణుకా ప్రభాకర్ శిష్య బృందం ఆడరమ్మ, పాడరమ్మ అనే అంశాన్ని, హిందుమతి శిష్య బృందం ఆడరోపాడరో అంశాన్ని, నళిని రమణ శిష్య బృందం కదిరి నృసింహులు.. అనే అంశాన్ని, ఎన్ శ్రీలత శిష్య బృందం ఘోర విచారణ అనే అంశాన్ని, రేణుకా ప్రభాకర్ శిష్య బృందం జగడపు తనువుల జాజర, జయజయ నృసింహ అనే అంశాలు, ఎన్ శ్రీలత శిష్య బృందం బాలనేత్రానల.., మనోజ శిష్య బృందం చిరుత నవ్వులవాడే చిన్నక్క.., నళిని రమణి శిష్య బృందం వినరో భాగ్యము విష్ణుకథ.. అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులు, కళాకారులు, నాట్యాచార్యులను పరవశింప చేశాయి. అంతకుముందుగా కృష్ణా విశ్వవిద్యాలయం నాట్య సంగీత డిప్లమా విద్యార్థినులు ఎస్ ఉషామాధురి, ఎన్ శ్యామల అన్నమాచార్యుల సప్తగిరి సంకీర్తన గానాలకు నల్లపాడు కుటుంబరావు, శేషం రమణ, కె అనిల్ కుమార్, పసుమర్తి హరనాధశాస్ర్తీ మృదంగం, వయోలిన్, ఎన్ శ్రీనివాస్ గాత్రం ద్వారా సహకరించారు. కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ అతిథులు ద్వారా కళాకారులు, నాట్య గురువులను దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.