కృష్ణ

ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: ఈ నెల 23వ తేదీన జరుగుతున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఏజంట్లు అప్రమత్తంగా ఉండాలని నూజివీడు సబ్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నూజివీడు నియోజకవర్గం పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆదివారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం మచిలీపట్నంలో జరుగుతుందని, 23వ తేదీ ఉదయం అయిదు గంటల కల్లా కౌటింగ్ కేంద్రానికి ఏంజట్లు రావాల్సి ఉంటుందని చెప్పారు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన అనంతరం ఈవిఎంలు, అనంతరం వీవీ ప్యాట్లలో పోలైన పత్రాలను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని ఆయన వివరించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏజంట్లకు ఏమైన అనుమానాలు, తేడాలుగా అనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలకు చెందిన లెక్కింపు ఏజంట్లు బయటకు వెళితే మళ్ళీ లోపలికి రానీయరని, లెక్కింపు పూర్తి అయిన తరువాత మాత్రమే వెళ్ళాలని రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయని తెలిపారు. ఈ సమావేశంలో నూజివీడు తహశీల్దారు తేజేశ్వరరావు, టీడీపీ కి చెందిన కౌన్సిలరు కందుల సత్యనారాయణతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.