కృష్ణ

అడుగంటిన భూగర్భజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు: ఈ ఏడాది నాగార్జున సాగర్ మైలవరం బ్రాంచి 3వ జోన్‌కు నీరు విడుదల చేయకపోవడంతో ఎ కొండూరు మెట్ట మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. భానుడి ప్రతాపానికి ఉదయం 10 గంటల నుండి ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. మూగజీవాలు సైతం తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పశుగ్రాసం కూడా కొరతగా ఉండటంతో పశువులు పడవేసిన వ్యర్థ పదార్థాలు తిని కడుపు నింపుకునే పరిస్థితులు దాపురించాయి. పశుగ్రాసం కొరత వల్ల పాల ఉత్పత్తులు కూడా నానాటికీ తగ్గిపోతున్నాయని రైతులు దిగాలు చెందుతున్నారు. మండలంలోని వాగులు, చెరువుల్లో చుక్కనీరు నిల్వ లేక భూమి బీటలు వారి ఎడారులుగా ఉన్నాయి. మార్చి నెలలో సాగర్ జలాలు కేవలం వారం రోజులు మాత్రమే విడుదల చేసినప్పటికి కాలువలు, యూటీలు పేరుతో చెరువులకు నీరు వెళ్ళే రంథ్రాలు మూసివేయడం వల్ల చెరువులకు చుక్కనీరు చేరలేదు. రైతులు తమ చేలల్లో డ్రిల్లింగ్ మిషన్ల ద్వారా 300 నుండి 400 అడుగుల మేర బోరు వేయించుకుని ఆ నీటితో ఆరు తడి పంటలను సాగు చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌ల వ్యవస్థ ముగిసిన తరువాత ప్రత్యేక అధికారులను నియమించడం వల్ల వారు గ్రామాల వైపు తిరిగి పర్యవేక్షించకుండా కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఒక పక్క కలెక్టరు గ్రామాల్లో తాగునీటి ఎద్దడికి చర్యలు తీసుకోవాలని అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికి ఆచరణకు నోచుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చెడిపోయిన బోర్లను రక్షిత మంచినీటి పథకాల బోర్లను మరమ్మతులు చేయించి మండల ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాలని కలెక్టరును వేడుకుంటున్నారు.