కృష్ణ

జిల్లాలో 23.4 లక్షల గ్రామీణ ఓటర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీలతో పాటు నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లో కొన్ని తండాలను పంచాయతీలుగా ఇటీవల ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన 10 పంచాయతీలతో పాటు మొత్తం 980 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఈ జాబితాను సోమవారం జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ చేతుల మీదుగా జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 10వ తేదీన ఓటర్ల జాబితా విడుదల కావల్సి ఉంది. కానీ ఇతర జిల్లాల్లో జాబితాల తయారీ పూర్తి కాని నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విడుదల కార్యక్రమం నేటికి వాయిదా పడింది. జిల్లాలో మొత్తం 980 గ్రామ పంచాయతీలకు గాను 23లక్షల 40వేల మంది ఓటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. డివిజన్, మండల, గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు నేడు బహిర్గతం కానున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా పంచాయతీ ఓటర్ల జాబితాలను పంచాయతీ అధికారులు చేపట్టారు. జిల్లాలో మొత్తం 9990 వార్డులు ఉన్నాయి. గతంలో ఉన్న 970 గ్రామ పంచాయతీల్లో 9918 వార్డులు ఉండగా ఇటీవలే కొత్తగా ఏర్పడిన పది గ్రామ పంచాయతీల్లో 82 వార్డులు ఉన్నాయి. నూజివీడు, మైలవరం, విస్సన్నపేట, ఎ.కొండూరులోని పలు తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా విడుదలైన అనంతరం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కులాల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేశారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నారు.