కృష్ణ

కంటి కాన్సర్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు: కంటి కాన్సర్‌లో ఒక్కటైన రెటీనో బ్లాస్టోమా చాలా భయకరమైన వ్యాధి. దానిపై అవగాహనతో ఉంటే నివారణ సాధ్యమని ఎక్సైజ్ కమిషనర్ ముకేష్ కుమార్ మీనా అన్నారు. తాడిగడపలోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్జాన సంస్థ అధ్వర్యంలో కంటి కాన్సర్ గురించి అవగాహన ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ప్రపంచ రెటీనోబ్లాస్టోమా అవగాహన వారాన్ని పురస్కరించుకుని ముఖ్యఅతిథి ముకేష్ కుమార్ మీనా జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ కంటి కాన్సర్ సామాన్యంగా మూడేళ్లలోపు పిల్లలకు 90శాతం ప్రభావం చూపుతుందన్నారు. ఈవైద్యం ఖరుదు ఎక్కువైనా ఎల్వీపీఈఈ మాత్రం పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుందన్నారు. డాక్టర్ విశాల్ రావల్ మాట్లాడుతూ కంటి కాన్సర్ మూడొంతులు పెద్దవాళ్లలోను, ఒక శాతం పిల్లలలోను వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాథమిక, ద్వితీయ స్థాయిలో రోగి లక్షణాలను తెలుసుకుని చికిత్స ప్రారంభించాలన్నారు. కంటిలో తీవ్రమైన నొప్పి, కళ్లు ఎరుపుదనం, వ్యాకోచించిన లేదా సంకోచించిన కన్ను వైద్య పరీక్షలు చేసి నిర్థారణ చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.