కృష్ణ

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన బందరు పార్లమెంట్ ప్రత్యేక పరిశీలకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకులుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి వినోద్ సోమవారం స్థానిక కృష్ణా విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో కలిసి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు కలెక్టర్ ఇంతియాజ్ ప్రత్యేక పరిశీలకుడికి వివరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతా ఏర్పాట్లను కూడా వివరించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, రిటర్నింగ్ అధికారులైన విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్, జెసీ-2 పిడుగు బాబూరావు, ముడా వీసీ విల్సన్ బాబు, బందరు, గుడివాడ ఆర్డీవోలు జె ఉదయ భాస్కర్, జివి సత్యవాణి, డెప్యూటీ కలెక్టర్ చక్రపాణి, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ మురళీ, డీఐఓ శర్మ తదితరులు పాల్గొన్నారు.

కోనేరుసెంటరులో పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు చేయాలి
మచిలీపట్నం (కోనేరుసెంటరు), మే 20: మచిలీపట్నం నడిబొడ్డు కోనేరుసెంటరులో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవటంతో నిత్యం వేలాదిగా ప్రయాణీకులు, వినియోగదారులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారని, వెంటనే టాయిలెట్లు నిర్మించాలని విజయ కృష్ణా కోస్తా జాతీయ రహదారి జన జాగృతి సంస్థ సభ్యులు మున్సిపల్ కమిషనర్ జె సంపత్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. టాయిలెట్లు లేకపోవటంతో కడుపుబ్బరం ఆపుకోలేక అక్కడే మూత్ర విసర్జన చేయటంతో కంపుకొడుతుందని పేర్కొన్నారు. కోనేరుసెంటరు వద్ద పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని విజయకృష్ణ జన జాగృతి సంస్థ మచిలీపట్నంకు వచ్చే ప్రతి కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తూనే ఉన్నామని, కానీ ఇంత వరకు పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయలేదని వినతిపత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్లు ఏర్పాటు చేసే వరకు వినతిపత్రాలు ఇస్తూనే ఉంటామని వారు కమీషనర్‌కు విన్నవించారు.