కృష్ణ

మహనీయుల ఆదర్శ జీవితాలే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): ముఖ్యమంత్రులుగా రాష్ట్భ్రావృద్ధికి విశేష సేవలందించిన టంగుటూరి ప్రకాశం పంతులు, కాసు బ్రహ్మానందరెడ్డి ఆదర్శ జీవితాలే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్ఫూర్తిదాయకమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అన్నారు. ప్రకాశం పంతులు 62వ వర్ధంతి, కాసు బ్రహ్మానందరెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా సోమవారం నగరంలోని పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా, మద్రాస్ ప్రెసిడెన్సీ సీఎంగానే కాకుండా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. న్యాయవాద విద్యనభ్యసించిన ఆయన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. సైమన్ కమిషన్‌కు ఎదురొడ్డి ధైర్యముంటే తనను కాల్చమంటూ బ్రిటీష్ సైన్యం ముందు నిలిచిన ప్రకాశం పంతులు ధైర్యసాహసాలకు ఆంధ్రకేసరిగా పేరుగాంచారన్నారు. 1951లో విజయవాడ కృష్ణానదిలో నిర్మించిన బ్యారేజీ వరదలకు కొట్టుకుపోగా కొత్త బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1957లో పూర్తిచేసి కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగు, సాగునీరందించిన మహనీయుడని కొనియాడారు. అలాగే అపర చాణిక్యుడిగా పేరొందిన కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ సీఎంగా ఏడేళ్లు సుదీర్ఘకాలం పనిచేసి హైదరాబాద్ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటునిచ్చారన్నారు. బీహెచ్‌ఈఎల్, ఐడీపీఎల్, హెచ్‌ఎంటీ, హిందుస్థాన్ కేబుల్స్, మిథాని, భారత్ డైనమిక్స్ వంటి కేంద్ర సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చి పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారన్నారు. సీఎంగానే కాకుండా కేంద్ర హోంమంత్రి, మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నత పదవులను అలంకరించి వనె్న తెచ్చారని, మహనీయుల అడుగుజాడలలో నడిచి వారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.