కృష్ణ

కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. మచిలీపట్నం పార్లమెంట్‌కు సంబంధించి బందరు మండలం రుధ్రవరం గ్రామంలో నూతనంగా నిర్మితమైన కృష్ణా విశ్వ విద్యాలయం భవంతిలో ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా విజయవాడ పార్లమెంట్‌కు సంబంధించి కానూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కించనున్న సంగతి తెలిసిందే. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని కైకలూరు, నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కూడా కృష్ణా వర్సిటీలోనే జరగనుంది. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ఏలూరు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవీఎంల ద్వారా పోలైన ఓట్లు, వీవీ ప్యాట్స్‌లోని స్లిప్పులను మాత్రమే ఇక్కడ లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏలూరులో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపుగాను ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఏడు నుండి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు వేర్వేరుగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 3వేల 981 పోలింగ్ కేంద్రాల్లో గత నెల 11వతేదీన పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇందుకు గాను అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు 179, పార్లమెంట్ ఓట్ల లెక్కింపుకు 179 టేబుల్స్ చొప్పున మొత్తం 358 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 376 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. తొలుత పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఇవీఎంలలో పోలైన ఓట్లు లెక్కిస్తారు. చివరిగా వీవీ ప్యాట్ల లెక్కింపు జరుగుతుంది. వీవీ ప్యాట్లలోని స్లిప్పుల లెక్కింపుగాను లాటరీ వేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు పోలింగ్ కేంద్రాలను లాటరీ ద్వారా గుర్తించి ఆయా పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్లలో ఉన్న స్లిప్పులను లెక్కిస్తారు. చివరిగా తుది ఫలితాన్ని లెక్కిస్తారు. వీవీ ప్యాట్ల లెక్కింపు కారణంగా అధికారికంగా ఫలితం వెలువడటానికి తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది.