కృష్ణ

హద్దు మీరారో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రమైన కృష్ణా విశ్వ విద్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. మంగళవారం ఆయన కృష్ణా వర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించారు. వీఐపీ, అభ్యర్థులు, ఏజెంట్లు, అఫీషియల్స్, కార్యకర్తల పార్కింగ్ స్థలాలను పరిశీలించిన ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే విధంగా విధులకు హాజరయ్యే ప్రతి పోలీసు సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి విభేదాలకు తావు లేకుండా రాజకీయ పక్షాలు సహకరించాలన్నారు. గ్రామాల్లో హద్దు దాటి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 300 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజున జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 208 పికెట్‌లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెట్టామన్నారు. కృష్ణా యూనివర్శిటీ వద్ద ఒక పార్కింగ్, గురుకుల పాఠశాల వద్ద మూడు పార్కింగ్ స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం లెక్కింపు బందోబస్తును తొమ్మిది సెక్టార్లుగా విభజించి సిబ్బందికి డ్యూటీలు కేటాయించామన్నారు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కెమెరాలతో సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. వర్సిటీకి రెండు కిలో మీటర్ల పరిధిలో సెక్షన్ 144 సీఆర్‌పీసీ, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. అవసరం మేరకు ఈ చట్టాలను జిల్లా అంతటా వర్తింప చేస్తామన్నారు. ఆ పరిధిలో ఆంక్షలు ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ త్రిపాఠి హెచ్చరించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవన్నారు. మరుసటి రోజు నిర్వహించే విజయోత్సవ ర్యాలీలకు డీఎస్పీ స్థాయి అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 22వతేదీ రాత్రి నుండే మద్యం దుకాణాలను పూర్తిగా మూసి వేయడం జరుగుతుందని ఎస్పీ త్రిపాఠి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ విజయారావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐలు వెంకటేశ్వరరావు, కిషోర్ బాబు, రూరల్ సీఐ రవి కుమార్, పామర్రు సీఐ శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.