కృష్ణ

కౌంటింగ్ కౌంట్‌డౌన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ఇంకా 24గంటలు మాత్రమే సమయం ఉండటంతో జిల్లా అంతటా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. నిన్న మొన్నటి వరకు కౌంట్ డౌన్‌కు రోజులు లెక్కించిన అభ్యర్థులు ఇప్పుడు గంటలు లెక్కిస్తున్నారు. ఒకొక్క గంట ముగుస్తున్న కొద్దీ అభ్యర్థులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా టెన్షన్ పెరుగుతోంది. ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయా అన్న అతృత, ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఇటీవల వెలువడిన పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా బెట్టింగ్‌లు వేసిన పందెపు రాయుళ్లలో మాత్రం నరాలు తెగే ఉత్కంఠకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. త్రిముఖ పోటీలో విజేత నేనంటే నేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మాకే ఉన్నాయంటూ ప్రతిపక్ష వైఎస్‌ఆర్ సీపీ విజయంపై పూర్తి స్థాయి స్పష్టతతో ఉంటే అధికార పక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అన్నీ బూటకమని ప్రజా తీర్పు మాదేనంటూ ప్రచారం చేసుకుంటోంది. ఈ రెండు పార్టీల సంగతి ఇలా ఉంటే వారసత్వ, కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ఏర్పాటైన తమ పార్టీయే సరికొత్త రాజకీయాలకు ఫలితాలు నాంది పలకనున్నాయని జనసేన నాయకులు చెప్పుకొస్తున్నారు. అయితే గెలుపుపై ఎవ్వరూ పట్టు తప్పి మాట్లాడటం లేదు. అమాత్యులు పోటీ చేసిన మచిలీపట్నం, మైలవరం, తిరువూరులో మాత్రం అత్యధిక మెజార్టీతో గెలుస్తామని తెలుగు తమ్ముళ్లు కోట్ల రూపాయల్లో పందాలు వేస్తున్నారు. అలాగే హాట్ హాట్‌గా మారిన ‘గుడివాడ’ విజేతపై కూడా కోట్లలోనే పందాలు జరిగినట్టు తెలుస్తోంది. హ్యాట్రిక్ వీరుడైన కొడాలి నాని ఇంటి బాట పడతారని కొందరైతే యువకుడు, ఉత్సాహవంతుడైన దేవినేని అవినాష్‌కే గుడివాడ వాసులు పట్టం కడతారంటూ మరికొంత మంది బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్‌లు వేసే విషయంలో పందెపు రాయుళ్లు ఏ మాత్రం ఆత్మ విశ్వాసాన్ని పోకుండా కాస్తుండటం మరింత విశేషం. అయితే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా స్వ పార్టీ వారు కూడా ప్రత్యర్థి గెలుపుస్తాడంటూ పందాలు కట్టిన దాఖలాలు కూడా జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కనిపిస్తోంది.