కృష్ణ

హోరాహోరీ పోరులో పార్థసారథి విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు: పెనమలూరు నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై ఆయన 11వేల 17 ఓట్ల మెజారిటీ సాధించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన 42రోజుల తరువాత కౌంటింగ్‌లో ఫలితాలు వెల్లడించడంతో నియోజకవర్గ పరిధిలో గురువారం ఉత్కంఠ నెలకొంది. కృష్ణా యూనివర్శిటీ కేంద్రంగా జరిగిన కౌంటింగ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్టు పోటీ సాగింది. మొదటి రౌండ్‌లో కొలుసు పార్థసారథికి 4066 ఓట్లు రాగా, బోడే ప్రసాద్‌కు 2321 ఓట్లు పోలాయ్యాయి. తొమ్మిదో రౌండ్ వరకు పార్థసారథి ఆధిపత్యం కొనసాగించగా, పదో రౌండ్‌లో 215 ఓట్ల ఆధిక్యంతో బోడే ప్రసాద్ ముందుకొచ్చారు. 14వ రౌండ్ వరకు పార్థసారథికి బోడే గట్టి పోటీ ఇచ్చారు. 15వ రౌండ్ నుంచి పార్థసారథి గెలుపు బాటలోకి దూసుకొచ్చారు. 26వ రౌండ్ ముగిసేటప్పటికి 11018 ఓట్ల మైజార్టీతో సారథి విజయాన్ని కైవసం చేసుకున్నారు. రౌండ్‌కు రౌండ్‌కూ ఉత్కంఠ రేపుతూ బోడే పార్థసారథికి గట్టి పోటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన పెనమలూరు మండలంలోనే పార్థసారథికి అధిక ఓట్లు పడ్డాయి. బోడేకు పట్టున్న పెనమలూరు, కానూరు, యనమలకుదురు, పోరంకి, తాడిగడప గ్రామాల్లోనే ఓట్లు సాధించటంలో ఆయన వెనుకబడ్డారు. మాజీ మంత్రిగా పార్థసారథికి నియోజకవర్గంపై గట్టి పట్టుంది. పేదల సాధకబాధకాలు తెలిసిన నేత కావడంతో పేదల బాంధవుడిగా ఆయన భారీ మైజార్టీ సాధించారు. ఇక లంకా కరుణాకర్‌దాస్ (బీఎస్పీ) 15285 ఓట్లు, గోపిశెట్టి దుర్గాప్రసాద్ (బీజెపీ) 1514 ఓట్లు, లాం తాంతియాకుమారి (కాంగ్రెస్) 2165 ఓట్లు, అంబంటి శివ నాగమల్లేశ్వరరావు (ఆలిండియా జైహింద్ పార్టీ) 232 ఓట్లు, కొక్కరిగడ్డ శ్యామ్ (నేషనల్ దళిత దళ్ పార్టీ) 150 ఓట్లు, కోనా విజయబాబు (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) 319 ఓట్లు, మేమూరి పార్థసారథి (ప్రజాశాంతి పార్టీ) 300 ఓట్లు, పొకల రాజు (ఇండియా ప్రజాబంధు పార్టీ) 94 ఓట్లు, వల్లూరు సామ్రాజ్యం (పెరమిక్స్ ఆఫ్ ఇండియా పార్టీ)) 156 ఓట్లు, కొలుసు కమలలక్ష్మి (స్వతంత్ర అభ్యర్థి) 109 ఓట్లు, శివరామకృష్ణప్రసాద్ పటమట (స్వతంత్ర అభ్యర్థి) 258 ఓట్లు సాధించగా, నోటాకు 1536 ఓట్లు పోలయ్యాయి.
మంత్రిగా సేవలు
రాజకీయ కుటుంబం నుండి వచ్చిన పార్థసారథి తన తండ్రి కొలుసు రెడ్డియ్య నుండి రాజకీయ వారసత్వాన్ని స్వీకరించారు. రెడ్డియ్య పార్లమెంట్ సభ్యుడుగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో సారథి ఉయ్యూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో ఉయ్యూరు నుండి చలసాని వెంకటేశ్వరరావు (పండు)పై పోటీ చేసి గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో కంకిపాడు నియోజకవర్గం పెనమలూరుగా, ఉయ్యూరు నియోజకవర్గం పామర్రుగా మారాయి. పెనమలూరు నుండి టీడీపీ అభ్యర్థి చలసాని పండుపై సారథి మళ్లీ అత్యధిక మైజార్టీతో గెలిచి పశుసంవర్ధక శాఖ, ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2014లో బందరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసి పరాజయాన్ని చవిచూశారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచిన సారథి మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నట్లు తెలుస్తోంది.