కృష్ణ

వంతెన మరమ్మతులతో రైళ్లు దారి మళ్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్): దక్షిణమధ్య రైల్వే పరిధిలోని కొట్టాయం సమీపంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నందున ఆ లైన్‌లో రాకపోకలు నిలిపివేసి దారి మళ్లింపుచేసి నడుపుతున్నట్లు దక్షిణ మద్య రైల్వే సీపీఆర్‌ఓ సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్ తిరువనంతపురం (17230) ఎక్స్‌ప్రెస్ 24న తిరువనంతపురం- హైదరాబాద్ (17229) కన్యాకుమారి ముంబాయి సీఎస్‌టీ (16382) తిరువనంతపురం, న్యూడిల్లీ ఎక్స్‌ప్రెస్ (12625) రైళ్లు 25న అలప్పూజ స్టేషన్ మీదుగా మళ్లించి నడపనున్నారని తెలిపారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని కపిలాస్- సలాగాన్ స్టేషన్ల మద్య కుర్ధా డివిజన్‌లో రైండోలైన్ నిర్మాణం, ఇంటర్ వాకింగ్ పనులు జరుగుతున్నందున 27,28,29,30న కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. సంత్రాగచ్చి- పుదుచ్చేరి (06009) కాచిగూడ- టాటానగర్ (07438) రెండు రైళ్లు, 27న కటక్ మీదుగా మళ్లించనున్నారు. టాటానగర్- కాచిగూడ (06058) సంత్రాగచ్చి- చైన్నై సెంట్రల్ రైలును 30న కటక్ మీదుగా మళ్లింపు చేసి నడుపుతున్నట్లు తెలిపారు.