కృష్ణ

ప్రజలకు పాదాభివందనం: వంశీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, : ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిద్యం వహించిన గొప్ప నియోజకవర్గం గన్నవరమని, అటువంటి నియోజకవర్గంలో ప్రజలు ప్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా తనను రెండవ సారి గెలిపించారని, ఇది ప్రజా విజయమని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ శ్రేణుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన ప్రజలు నన్ను గెలిపించినందుకు మనస్పూర్తిగా పాదాభివందనం చేస్తున్నానన్నారు. గత ఎన్నికల్లో 95వేల ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో లక్షా నాలుగువేల ఓట్లు వచ్చాయన్నారు. తనకు ఓట్లు ఏమి తగ్గలేదని, గతం కన్నా 5వేల ఓట్లు ఎక్కువగానే వచ్చాయన్నారు. నియోజకవర్గంలోని షావుకార్లలందరు ఏకమైనప్పటికి ప్రజలు తన నీతిని బట్టబయలు చేశారన్నారు. స్ధానిక పరిస్థితులు దృష్ట్యా తనకు ఓట్లు వేయలేకపోయారని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులు పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వంశీ హామీ ఇచ్చారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని కచ్చితంగా తిరిగి పేదలకు ఇప్పించేందుకు తన వంతు సాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం మరింత పాటుపడతానని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వంశీ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పొట్లూరి బసవారావు, ఎంపీపీ పట్రా కవిత, వైస్ ఎంపీపీ గొంధి పరంధామయ్య, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పడమట సురేష్, గొంధి శివకోటేశ్వరరావు, కోటగిరి జగన్నాధరావు, అరవపల్లి బోసు, కలామ్, అనగాని రవి, పాలడుగు నాని, గూడపాటి తులసీమోహన్, కందిమళ్ళ అంజలికుమారి తదితరులు పాల్గొన్నారు.