కృష్ణ

‘నాని’ల విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : రెండు ప్రధాన పార్టీల్లో ఉన్న నానిలు విజయం సాధించారు. నానీల విజయం ఆయా పార్టీ శ్రేణులు, అనుచరవర్గంలో నూతనోత్సాహాన్ని నింపింది. తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మరోసారి విజయవాడ పార్లమెంట్ బరిలో నిలిచి ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్‌ను 8వేల 911 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండవ పర్యాయం పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కేవలం మూడు ఎంపీ స్థానాలనే దక్కించుకుంది. అందులో కేశినేని నాని ఒకరు కావడం విశేషం. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సన్నిహితులుగా పేరున్న పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని)లు కూడా వారి వారి నియోజకవర్గాల నుండి విజేతలుగా నిలిచారు. మచిలీపట్నం రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించటంతో పాటు ఎవరికి ఏ చిన్న సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చే పేర్ని వెంకట్రామయ్య (నాని) బందరు లడ్డూని దక్కించుకున్నారు. తన తండ్రి, మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి రాజకీయ వారసుడిగా బందరు రాజకీయాల్లో పేర్ని తన మార్క్ కనబరుస్తున్నారు. బందరు అసెంబ్లీ నుండి మొత్తం ఐదు పర్యాయాలు పోటీ చేసిన పేర్నిని మూడు సార్లు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు. 1999లో తొలిసారిగా పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి అయిన నడకుదిటి నరసింహరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2004లో మళ్లీ పోటీ చేసి నడకుదిటి నరసింహరావుపై విజయం సాధించారు. 2009లో కూడా పోటీ చేసిన పేర్ని నడకుదిటి నరసింహరావు అల్లుడు కొల్లు రవీంద్రపై విజయం సాధించారు. 2014లో మళ్లీ కొల్లుపై ఓడిపోయి హ్యాట్రిక్ విజయాన్ని చేజార్చుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కొల్లు రవీంద్రపై ఘన విజయం సాధించారు. ఇక కొడాలి వెంకటేశ్వరరావు (నాని) విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన దివంగత ఎన్టీ రామారావు మనువడు, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుడివాడ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు (2004, 2009 సంవత్సరాల్లో) టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ అధినేత చంద్రబాబును విభేదించి 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టారు. అయితే కొడాలి నాని ఏ పార్టీలో ఉంటే పార్టీ అధికారంలోకి రాదు అనే అపవాదు ఉంది. ప్రస్తుత విజయంతో ఆ అపవాదు పూర్తిగా తొలగిపోయింది. వరుసగా నాల్గవ సారి గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నానికి మంత్రి పదవి కూడా దాదాపు ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.