కృష్ణ

నామినేటెడ్ నాయకుల రాజీనామా బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారంతా ఒక్కొక్కరిగా రాజీనామా బాట పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. పార్టీలోని దిగ్గజాలు సైతం ఓటర్లు ఇచ్చిన తీర్పుకు ఇంటి ముఖం పట్టక తప్పలేదు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కృష్ణాజిల్లాలో కూడా ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. రెండు పార్లమెంట్, 16 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలతో సరి పెట్టుకోవల్సి వచ్చింది. అది కూడా పోటాపోటీ పోరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గట్టెక్కారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కేశినేని శ్రీనివాస్ (నాని)కి పోస్టల్ ఓట్లు కలిసొచ్చాయి. విజయవాడ తూర్పు, గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలైన గద్దె రామ్మోహనరావు, వల్లభనేని వంశీ తమ వ్యక్తిగత స్టామినాతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గట్టెక్కారు. ఉపసభాపతి, మంత్రులుగా కొనసాగుతూ ఎంతో రాజకీయ నేపథ్యం కలిగిన మండలి బుద్ధప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కెఎస్ జవహర్ వంటి వారు కూడా ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయారు. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా పలు నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్న తెలుగు తమ్ముళ్లంతా ఒకరి తర్వాత ఒకరు వారి వారి పదవులకు రాజీనామా చేస్తున్నారు. తొలిగా విజయవాడ దుర్గ గుడి పాలకవర్గ చైర్మన్ ఔరంగబాబు తన పదవికి రాజీనామా చేశారు. అలాగే జిల్లాలోని పలు మార్కెట్ యార్డుల చైర్మన్‌లు, దేవస్థానాల చైర్మన్‌లు రాజీనామాలు చేశారు. జిల్లాలో అతి పెద్ద నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్న వారిలో వర్ల రామయ్య, బూరగడ్డ వేదవ్యాస్, బొడ్డు వేణుగోపాలరావు, నాగుల్ మీరా, పి అంకమ్మ చౌదరి, బండారు హనుమంతరావు ఉన్నారు. పామర్రు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్‌గా కొనసాగుతుండగా పెడన నియోజకవర్గానికి చెందిన మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా) చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పెడనకు చెందిన బీసీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు ఇటీవల కాలంలోనే రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. విజయవాడకు చెందిన నాగుల్ మీరా పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్‌గా, పి అంకమ్మ చౌదరి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా సేవలు అందిస్తున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రధాన అనుచరుడైన బండారు హనుమంతరావు కూడా ఇటీవలే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు వీరంతా రాజీనామా చేయనున్నారు. వీరు రాజీనామా చేయని పక్షంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమే వారి నామినేటెడ్ పదవులను రద్దు చేయనుంది. ఆ పరిస్థితి రాక ముందే వీరంతా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి.