కృష్ణ

మంట పుట్టిస్తున్న ‘రోహిణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయన్న పెద్దల నానుడిని నిజం చేస్తూ భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తుండటంతో ప్రజానీకం అల్లల్లాడుతోంది. రోహిణి కార్తె ఈ నెల 25వ తేదీన ప్రారంభం కావటంతో ఉదయం 7గంటలకే ప్రచండ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో మంటలను కలిగించే వేడితో పాటు వడగాల్పులు వీస్తుండటంతో జీవరాసులు సైతం కకావికలమవుతున్నాయి. ఆదివారం పట్టణంలో ఉష్ణోగ్రతలు అధికం కావటంతో జన సంచారం లేక ప్రధాన రహదారులు సైతం వెలవెలబోయాయి. పలు దుకాణాలను సైతం సాయంత్రం వరకు తెరవలేదు. అత్యవసరమైన పని తప్పితే ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాలేదు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణీకులు లేక ఖాళీగా దర్శనమిచ్చింది. యువకులు, యువతులు సైతం మాస్కులు ధరించి ప్రయాణం చేయటం కనిపించింది. సాయంత్రం 6గంటలు దాటినా వేడి తగ్గకపోవటంతో మేడల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఉడికిపోయారు. అసలు పసికందులు, వృద్ధులు, చిన్నారులు, బాలింతలు వడగాల్పులకు నీరసించి నిస్సత్తువను కోల్పోయారు. ఎండ వేడిమి నుండి రక్షించుకునేందుకు పలు రకాల జ్యూస్‌లను ఆశ్రయించారు. బడా బాబులు ఏసీలలో హాయిగా నిద్రపోతుంటే సామాన్య ప్రజలు వేడి గాలులకు చెట్లకింద సేదతీరారు. ఫ్యాన్ గాలి సైతం వేడిగా రావటంతో ఏమి చేయాలో తెలియక నరకయాతనను అనుభవిస్తున్నారు. ఎప్పుడు వర్షాలు ఏప్పుడు పడతాయిరా బాబోయ్ అని వరుణ దేవుడిని ప్రార్దించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వృద్ధుల పరిస్థితి విషమమేనని చెప్పవచ్చు. చల్లచల్లగా ఉండే పల్లెటూర్లలో సైతం ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి.