కృష్ణ

వైసీపీ ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, : జిల్లాలోని వైసీపీ శాసనసభ్యుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఐతవరంలోని తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ఆతిథ్యమిచ్చారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావులతో పాటు వైసిపి రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల రఘురాం తదితరులు వసంత నివాసానికి విచ్ఛేశారు. వీరికి వసంత దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అందరూ కొద్దిసేపు పలు విషయాలపై చర్చిస్తూ ఉల్లాసంగా గడిపారు. కేపీ తండ్రి వసంత నాగేశ్వరరావును కూడా ఆప్యాయంగా పలకరించారు.

ఓడినా ప్రజా సేవలో తరిస్తా

జగ్గయ్యపేట, మే 26: ఎన్నికలలో ఓడినా ప్రజా సేవ నుంచి వెనుకడుగు వేసేది లేదని, ప్రజలకు,కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన గెలుపుకోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాలు చైర్మన్‌గా, పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా తన రాజకీయ జీవితంలో ఆస్తులు సంపాదించకున్న ఎందరో ఆత్మీయులను సంపాదించానని అన్నారు. నియోజకవర్గంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావచ్చాయని ఆయన వివరిస్తు పట్టణానికి మంచినీరు అందించే కృష్ణాజలాల పథకం మోటార్లు బిగించే స్థితికి చేరిందని, కృష్ణా ఎత్తిపోతల పథకం డిజైన్ దశలో ఉందని, పట్టణంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా త్వరలో గృహాలు అందుతాయని ఆయన వివరిస్తు తనకు ఓటు వేసిన వారికే కాక తమ మీద కోపంతో ఓటు వేయని వారికి సైతం వారిని సంతృప్తి పరచలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. తాను సేవా కార్యక్రమాలతోనే రాజకీయం ప్రారంభించానని, వాటిని కొనసాగిస్తానని తెలిపారు. నూతనంగా గెలిచిన వారికి తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మంచి పరిపాలన అందించాలని అన్నారు. తాను ఎన్టీఆర్ వైద్యశాల, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సేవలు అందించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, రాష్ట్రంలోని వైద్య సహాయం అందించడంలో నియోజకవర్గం అగ్రగామిగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గ ఎన్నో అంశాలలో ముందు ఉండటంతో తనకు సహకరించిన అధికారులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతు వారి సహకారం మరువలేనిదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక పట్టణంలో జరిగిన ఊరేగింపులో తమ లారీ అద్దాలను ధ్వంసం చేశారని, అయినా తాము కేసు పెట్టలేదని అన్నారు. గ్రామాల్లో సైతం తమ కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఎదుటి పక్షం ప్రయత్నిస్తుందని, ఇలాంటివి సహించమని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. తన ప్రజా సేవ జీవితం సంతృప్తికరంగా సాగిందని, డబ్బు లేకుండా వైద్య సేవలు అందక మరణించడం జరుగకూడదన్న తన లక్ష్యం నేరవేరినట్లు ఆయన వివరించారు.