కృష్ణ

నో’ కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : సరిగ్గా మూడు నెలల క్రితం అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్)ను ఎత్తి వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు నెలలు కోడ్ వల్ల జిల్లా ప్రజలు పడ్డ ఇబ్బందులన్నీ ఒక్కసారిగా తొలగినట్లైంది. అన్ని జిల్లాల్లో రెండు నెలల పాటు కోడ్ అమలులో ఉండగా మన జిల్లాలో మాత్రం కృష్ణా, గుంటూరు పట్ట్భద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పుణ్యమా అంటూ మూడు నెలలు అమలులో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు నెల రోజులు ముందుగానే కోడ్ కూత పెట్టింది. ఫిబ్రవరి 24వతేదీన ఎమ్మెల్సీ ఎన్నికకై కూసిన కోడ్ ఆ ఎన్నిక ముగియక ముందే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటంతో కోడ్ కొనసాగింది. ఎట్టకేలకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అమలులో ఉన్న కోడ్‌ను ఎత్తి వేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోడ్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆర్థికపరమైన ప్రజా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే ‘మీకోసం’ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కూడా జరగలేదు. దీంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. నిధులు మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రారంభమైన అభివృద్ధి పనులు కూడా ఎన్నికల విధుల కారణంగా అధికారులు సక్రమంగా నిర్వహించ లేకపోయారు. ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా ఎమ్మెల్సీ ఎన్నిక, ఆ తర్వాతే సార్వత్రిక ఎన్నికలు రావటంతో జిల్లా అధికార యంత్రాంగం తీవ్రమైన పని ఒత్తిడికి గురైంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష చేసేందుకు కూడా అధికారులకు సమయం దొరకని పరిస్థితి నెలకొంది. ప్రతి క్షణాన్ని వారు ఎన్నికల విధులకే కేటాయించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి నెల రోజులైనప్పటికీ ఫలితాలు వెలువడని కారణంగా కోడ్ అమలులోనే ఉండటంతో ఈ నెల రోజులు కూడా అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించలేకపోయారు. కౌంటింగ్ ఏర్పాట్లు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికే నెల రోజుల సమయం సరిపోయింది. ఏది ఏమైనా కోడ్ ఎత్తి వేతతో ఇకపై అధికార యంత్రాంగం ప్రజా సమస్యలపై దృష్టి సారించనుంది.