కృష్ణ

ఐదేళ్లలో పారదర్శక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా తమ ఐదేళ్ల పాలన సాగిందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించే అవకాశం తనకు లభించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. జులై 3వ తేదీతో ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మంగళవారం జరిగిన చివరి సర్వసభ్య సమావేశంలో ఆమె ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఐదేళ్లుగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా అన్ని మండలాలకు సమ న్యాయం చేకూరస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిధుల కేటాయింపు జరిగినట్టు తెలిపారు. ఒక పక్క జిల్లా పరిషత్‌కు ఆదాయ వనరులను సమకూరుస్తూనే మరో పక్క మహిళా సాధికారత దిశగా తమ పాలకవర్గం పని చేసిందన్నారు. రూ.80కోట్ల పైబడి జెడ్పీ రహదారుల మరమ్మతులు, నీటి వసతులు కల్పించామన్నారు. జెడ్పీ ఆదాయ వనరులను పెంపొందించేందుకు గాను జెడ్పీ ఆస్తులను గుర్తించి వర్తక, వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంను కనె్వన్షన్ సెంటర్‌గా ఆధునీకరించి కోటి పది లక్షల రూపాయలు ఆదాయం పెంపొందించడం జరిగిందన్నారు. జిల్లాలో 2500 మంది మహిళలకు కుట్టు మిషన్‌లో శిక్ష ఇవ్వటంతో పాటు కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. 16 మండలాల్లో మహిళా సాధికారత భవనాలు నిర్మించి విస్తరాకుల తయారీ మిషన్, జ్యుట్ బ్యాగ్ మిషన్, కంప్యూటర్స్, కుట్టు మిషన్లును ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వటంతో పాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 33 మండలాల్లో 8వేల 500 మంది మహిళలకు ఆరోగ్య దీప్తి ద్వారా కార్పొరేట్ హాస్పటల్ వైద్యులచే గైనిక్, ఆర్థో, కార్డియాక్, యూరాలజీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించటంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 55వేల మంది పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట ఉచితంగా స్నాక్స్ అందించి 94 శాతం ఉత్తీర్ణత సాధించడంలో జెడ్పీ కృషి చేసిందన్నారు. జెడ్పీలో స్వచ్ఛ భారత్ నిర్వహించి గార్డెన్ ఏర్పాటు ద్వారా సుందరీకరణకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే పంట సంజీవని ద్వారా చేపల సాగు చేపట్టి జెడ్పీకి అదనపు ఆదాయ వనరులు సమకూర్చటంతో పాటు పంట సంజీవని పట్ల రైతుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించామన్నారు. హుదూద్ తుఫాన్ బాధితులకు జిల్లాలోని ప్రజా ప్రతినిథులు, ఉద్యోగుల భాగస్వామ్యంతో మూడు లక్షల పైగా కూరగాయలు, మరో మూడు లక్షల పై చిలుకు నగదును అందించడం జరిగిందన్నారు. కారుణ్య నియామకాల ద్వారా 40 మంది ఉద్యోగుల పిల్లలకు ఉపాధి కల్పించామన్నారు. సేవా ధృక్పదం పెంపొందించే విషయంలో 70 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పించి వారి నుండి మరింత సేవలను తీసుకుని జిల్లాను అభివృద్ధి పథంలో పయనింప చేసినట్లు చెప్పారు. మహిళలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించి ఆహార జ్యోతి కార్యక్రమం ద్వారా వారికి పోషక విలువలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వేయి కళ్లతో కార్యక్రమం ద్వారా మహిళా చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించామన్నారు. ఇలా అనేక కార్యక్రమాలను జిల్లా పరిషత్ ద్వారా ఐదేళ్లల్లో నిర్వహించి ప్రజల మన్ననలు పొందినట్లు చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తెలిపారు. సమావేశానంతరం జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, అధికార, ప్రతిపక్ష సభ్యులంతా ఘనంగా సత్కరించారు.