కృష్ణ

స్థానిక సంస్థల్లో టీడీపీ సత్తా చూపిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో చూపించాలని మాజీ మంత్రి, బందరు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త కొల్లు రవీంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై శనివారం సాయంత్రం తన నివాసంలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను అనే్వషిస్తూనే స్థానిక పోరుకు సిద్ధం కావాలన్నారు. తొలిగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకునే విధంగా కృషి చేయాలన్నారు. ఆ తర్వాత పురపాలక సంఘం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి ఇప్పటి నుండే శ్రమించాలన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగాలన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. దీన్ని రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు నిలువరించని పక్షంలో ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, బచ్చుల అనీల్ కుమార్, కో-ఆప్షన్ సభ్యుడు గనిపిశెట్టి గోపాల్, మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ ఖాజా, తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు.

15 అడుగుల క్రికెట్ బ్యాట్ ఆవిష్కరణ
మచిలీపట్నం (కల్చరల్), జూన్ 15: వరల్డ్ కప్‌లో టీమిండియా ఘన విజయం సాధించాలని కాంక్షిస్తూ శనివారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ప్రధాన మున్సిపల్ పార్కులో 15 అడుగుల క్రికెట్ బ్యాట్‌ను ఆవిష్కరించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్ దాదా, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, లంకా సూరిబాబు, అస్ఘర్, గూడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.