కృష్ణ

కక్షిదారులకు సత్వర న్యాయం జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ సి ప్రవీణ్ కుమార్ సూచించారు. మండల కేంద్రం మొవ్వలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆదివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని క్షేత్రయ్య కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయ స్థానంలో మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి మండలాలకు చెందిన కక్షిదారులకు సత్వర న్యాయం అందించే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అవనిగడ్డ కోర్టు నుండి నూతనంగా ఏర్పాటు చేసిన మొవ్వ కోర్టుకు 915 కేసులు బదిలీ అయినట్లు తెలిపారు. వీటిలో 315 సివిల్ కేసులు, 600 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. నూతన కోర్టు ప్రారంభానికి విచ్చేసిన జస్టిస్ ప్రవీణ్ కుమార్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్, పూర్ణకుంభంతో పండితుల వేద మంత్రాలు మధ్య ఘన స్వాగతం పలికారు. నూతన కోర్టు శిలాఫలకాన్ని జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం నూతన కోర్టు న్యాయమూర్తి బి రమ్య రెండు కేసులను ఆదివారం శెలవుదినమైనా స్వీకరించి రాజీపడిన కేసును, కక్షిదారులు రాని కేసును వాయిదా వేశారు. ఈ సందర్భంగా అవనిగడ్డ, మచిలీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు జస్టిస్ ప్రవీణ్ కుమార్ దంపతులను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రసిద్ధి చెందిన శ్రీ మువ్వ వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని ప్రవీణ్ కుమార్ దంపతులు సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దీవి సీతారామ హనుమాన్ వంశీమోహన్ జస్టిస్ దంపతులను ఆశీర్వదించి శేష వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఎం రామకృష్ణ, హైకోర్టు న్యాయమూర్తులు గంగారామ్, జిల్లా న్యాయమూర్తి ఎస్ రజని, పి వెంకటేశ్వరరెడ్డి, కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్, పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్ కుమార్, అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో చల్లపల్లి, అవనిగడ్డ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.