కృష్ణ

కౌలు రైతుల పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పుడమి తల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కౌలు రైతుల పరిస్థితి కడు దుర్భరంగా మారింది. అంతంత మాత్రంగా ఉన్న వ్యవసాయ రంగంలో ఎదురీదుతున్న కౌలు రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువయింది. పాలకులు మారుతున్నా కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు కానరావడం లేదు. కౌలు రైతులకు మేమున్నాం అంటూ ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకులు ఆ తర్వాత మొహం చాటేస్తున్నారు. కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించ లేకపోతున్నారు. ఫలితంగా కౌలు రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. ఇటీవల పక్షం రోజుల పాటు నిర్వహించిన కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో ప్రహసనంగా మారింది. మొక్కుబడిగా గ్రామ సభలు నిర్వహించిన అధికారులు అవసరం మేర కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను ఇవ్వలేకపోయారు. గ్రామసభల ద్వారా 22వేల 34 కార్డులను రెన్యువల్ చేసిన అధికారులు కొత్తగా 22వేల 999 మందికి రుణ అర్హత కార్డులు జారీ చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 45వేల 33 మంది చేతుల్లో రుణ అర్హత కార్డులు వచ్చాయి. గ్రామసభల నిర్వహణపై ఆశించిన స్థాయిలో ప్రచారం లేని కారణంగా అధిక శాతం మంది రైతులు ఈ కార్డులు అందలేదన్న ఆరోపణలు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేల నుండి వినిపించాయి. ఇచ్చిన కార్డులు కూడా అక్కరకు వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొంది. అధికారులు జారీ చేసిన రుణ అర్హత కార్డులపై ఏ ఒక్క బ్యాంకు కూడా పంట రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. దీంతో కౌలు రైతులు పోరాట బాట పట్టారు. ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జిల్లాలో కౌలు రైతుల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. చివరి రోజు సోమవారం ఛలో కలెక్టరేట్ పేరిట కలెక్టరేట్ ముట్టడికి కౌలు రైతులు సంసిద్ధమయ్యారు. ఈ నెల 15వతేదీన ఉయ్యూరులో ప్రారంభమైన పాదయాత్ర 17వతేదీ ఉదయం 11గంటలకు జిల్లా కేంద్రం మచిలీపట్నం చేరుకోనుంది. కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాతో పాటు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.