కృష్ణ

భూ వివాదాలపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: కౌలు రైతులకు సర్ట్ఫికెట్టు ఆఫ్ కల్టివేషన్ (సీఓసీ) జారీలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్లు జాయింట్ కలెక్టర్ - 2 బాబూరావు వెల్లడించారు. సోమవారం మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా జిల్లా స్థాయి అర్జీల స్వీకరణను నూజివీడులోని ఎస్ స్కేర్ కనె్వషన్ హాల్‌లో జెసి - 2 బాబూరావు, సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ - 2 బాబూరావు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా భూ వివాదాలకు సంబంధించిన అర్జీలు వస్తున్నాయని, వీటిని వీలైంత త్వరగా ఆయా మండలాల తాహశీల్దార్లు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వీటితో పాటు ఇళ్ళ స్థలాలు, పింఛన్లు, పోలీసులకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని, వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. ఖరీఫ్ సీజనులో లక్ష మంది కౌలుదారులకు సర్ట్ఫికెట్ ఆఫ్ కల్టివేషన్, లీజ్ అగ్రిమెంట్ సర్ట్ఫికెట్ (సీఎల్‌సీ) కార్డులు జారీ చేసే విధంగా వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికే 5 వేల మందికి ఎల్‌ఈసీ కార్డులు జారీ చేశామని జెసి - 2 బాబూరావు తెలిపారు. వైద్యశాఖ జారీ చేస్తున్న సదరమ్ సర్ట్ఫికెట్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులందరూ విధిగా పాల్గొనాలని సూచించారు. డివిజన్ పరిధిలోని మండలాల నుండి భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వీటిని ఆయా మండలాల తాహశీల్దార్ల ద్వారా పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మీకోసం కార్యక్రమంలో మొత్తం 221 అర్జీలు స్వీకరించినట్లు సబ్ కలెక్టర్ స్విప్నిల్ దినకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, మత్స్య, పశు సంవర్థక శాఖల జాయింట్ డైరెక్టర్లు మోహనరావు, యాకూబ్ బాషా, భరత్ రమేష్, డిఎంహెచ్‌ఓ రమేష్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కృష్ణకుమారి, డ్వామా డైరెక్టర్ గురుప్రసాద్, ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

భూ సంబంధిత అర్జీలను తక్షణమే పరిష్కరించాలి

మచిలీపట్నం (కోనేరుసెంటరు), జూన్ 17: ‘మీకోసం’లో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై ప్రజల నుండి అర్జీలు వస్తున్నాయని, అధికారులు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి, ముడా వీసీ విల్సన్‌బాబు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కలిదిండి మండలం పెదలంక శివారు పెదపుట్లపూడి గ్రామ నివాసి నడకుదుటి కనకలక్ష్మి పిత్రార్జితం భూమి సర్వే చేయించి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని కోరుతూ మీకోసంలో అర్జీ సమర్పించారు. మండవల్లి గ్రామానికి చెందిన నల్లమోతు పాండురంగారావు తదితరులు మండవల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ, గుమస్తా, కంప్యూటర్ ఆపరేటర్ల అవకతవకలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మీకోసంలో అర్జీలు ఇచ్చారు. గూడూరు మండలం గండ్రం గ్రామ నివాసి గుడివాడ రామారావు, వెంకట నరసయ్యలు తమ పొలం కాజేయాలని దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అర్జీ దాఖలు చేశారు. కంకిపాడు మండలం మారేడుమాక గ్రామ నివాసి వీర వెంకటరత్నం తమ స్థలం ఆక్రమించి గొడవ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో శ్రీ షిరిడి సాయి సేవాశ్రమం మందిరం నిర్మాణానికి 10 యూనిట్లు ఇసుక అవసరమైందని, పర్మిషన్ ఇప్పించాలని కోరుతూ అర్జీలు అంద చేశారు. కోడూరు మండలం పోటుమీద గ్రామ శివరు జార్జిపేట ఎస్‌సి గ్రామ పంచాయతీగా మార్పు చేయాలని కోరుతూ జి చక్రపాణి తదితర గ్రామస్థులు అర్జీ దాఖలు చేశారు. ముడా డిప్యూటీ కలెక్టర్ సుజాత, రమాదేవి పాల్గొన్నారు.