కృష్ణ

దద్దరిల్లిన కలెక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఇటు కౌలు రైతుల చలో కలెక్టరేట్, అటు పారిశుద్ధ్య కార్మికుల ధర్నాతో కలెక్టరేట్ దద్దరిల్లింది. కాంట్రాక్ట్ టెండర్ విధానంలో గత 20 యేళ్లుగా గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.18వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ సీఐటీయు తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు చౌటపల్లి రవి, వై నరసింహరావులు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీవో నెం 132ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని, గ్రామ పంచాయతీ సిబ్బంది టెండరు విధానం రద్దు చేయాలని, మంత్రివర్గ నిర్ణయం ప్రకారం పారిశుద్ధ్య కార్మికులందరికీ కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, అర్హులైన వారిని రెగ్యులర్ చేయాలని, చట్టబద్ధత సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ టెండరు విధానంతో ఉద్యోగ భద్రత కరువైందన్నారు. ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. నెలలు తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలి నాయుడు నాయకత్వంలో జరిగిన ధర్నాకు సీఐటీయు నాయకులు సిహెచ్ జయరావు, బూర సుబ్రహ్మణ్యం సంఘీభావం తెలిపారు. సంఘ ప్రతినిథులు ఎం జగన్, డి జగన్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వైద్యుల సమ్మె విజయవంతం
మచిలీపట్నం (కల్చరల్), జూన్ 17: వైద్యులపై దాడులను నిరసిస్తూ దేశ వ్యాప్త వైద్యుల సమ్మెలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు తమ విధులను బహిష్కరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలుపుదల చేసి ఆయా ఆస్పత్రుల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆస్పత్రి వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు కూడా పాల్గొని వైద్యులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు నేతృత్వం వహించగా వివిధ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. వైద్యుల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.