కృష్ణ

పోలీస్ స్టేషన్ గడప తొక్కే బాధితులందరికీ భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: న్యాయం కోసం పోలీసు స్టేషన్ గడప ఎక్కే ప్రతి ఒక్క బాధితునికి భరోసా కల్పించే విధంగా పోలీసులు సేవలు ఉండాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బారు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిష్కార చర్యలు చేపట్టారు. ప్రతి సోమ, శనివారాల్లో నిర్వహించే ప్రజాదర్బారులో తనతో పాటు పోలీసు అధికారులు విధిగా పాల్గొంటారని తెలిపారు. దీని వల్ల ప్రజలు తెలిపే సమస్యలకు తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజాదర్బారులో వచ్చే ప్రతి అర్జీకి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వాటిపై క్షుణ్ణంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ విజయారావు, అవనిగడ్డ, గుడివాడ డీఎస్పీలు పోతురాజు, మహేష్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.