కృష్ణ

చిరు జల్లుల సవ్వడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): హమ్మయ్యా.. వాతావరణం చల్లబడింది. గత రెండు నెలలుగా అధిక ఉష్ణోగ్రతలతో అతలాకుతలమవుతున్న జిల్లా ప్రజలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతం కావటంతో పాటు సన్నటి తుంపర్లతో కూడిన చిరు జల్లులు పడటంతో ప్రజలు సేదతీరారు. వృద్ధులు ఈ ఏడాదికి గట్టెక్కినట్లైనని భావిస్తున్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, రోగులు వాతావరణం చల్లబడటంతో తేరుకున్నారు. బందరు పట్టణం గత రెండు నెలలు తరువాత సోమవారం పగలే జన సంచారంతో రహదారులు, కోనేరుసెంటరు, బస్టాండ్ సెంటర్ తదితర సెంటర్లు కళకళలాడాయి. కొనుగోలుదారులు భారీ సంఖ్యలో పట్టణానికి చేరుకోవటంతో కోనేరుసెంటరు నుండి బస్టాండ్ సెంటరు వరకు ఉన్న ప్రధాన రహదారి కిటకిటలాడింది. పాఠశాలలు పునఃప్రారంభం కావటంతో బ్యాగ్‌లు, పుస్తకాలు, స్టేషనరీ కొనుగోలు చేసేందుకు ఎక్కువ సంఖ్యలో పలు ప్రాంతాల నుండి ప్రజలు పట్టణానికి చేరుకుంటున్నారు. అలాగే పట్టణంలోని ఇరుకు గదుల్లో నివశించే పేద, మధ్య తరగతి ప్రజలు చల్లటి గాలులు వీస్తుండటంతో వారి సంతోషానికి అవధులులేకుండా పోయాయి. చిరుచిరు జల్లులలో చిన్నారులు తడుస్తూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఇదిలావుండగా వరుణదేవుడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రైతులు, ప్రజలు తేలికపాటి చిరుజల్లులు పడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం ఇలాగే ఉండి కొద్దిపాటి వర్షం కురిస్తే వేసవి దుక్కులు దునే్నందుకు రైతన్నలు సిద్ధంగా ఉన్నారు. అలాగే వేసవి ఉష్ణోగ్రతలకు దాహం కేకలు పెడుతున్న ప్రజలు, పశుపక్ష్యాదులు కొంత ఉపశమనం పొందారు. ఎండిపోయి మోడువారిన చెట్లకు తేలికపాటి వర్షం ఊరటనిచ్చింది. ఏది ఏమైనా సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు చల్లటి గాలులు వీచటంతో పట్టణంలోని రహదారులన్నీ జనంతో కిటకిటలాడాయి.