కృష్ణ

కదం తొక్కిన కౌలు రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సమస్యల పరిష్కారం కోరుతూ కౌలు రైతులు గళమెత్తారు. అర్హులైన ప్రతి ఒక్క కౌలు రైతుకి రుణ అర్హత గుర్తింపు కార్డులతో పాటు బ్యాంకర్ల ద్వారా పంట రుణాలు మంజూరు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహించిన పాదయాత్ర విజయవంతమయింది. ఈ నెల 15వతేదీన ఉయ్యూరు నుండి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నం చేరింది. ముగింపు సందర్భంగా నిర్వహించిన చలో కలెక్టరేట్‌లో వేలాది మంది కౌలు రైతులు హాజరై తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కోనేరుసెంటరు నుండి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పంట పెట్టుబడి సాయాన్ని నేరుగా వాస్తవ సాగుదారులకు అందించాలన్నారు. చెరకు పంట రైతులకు గత ఆరు నెలలుగా బకాయి పడ్డ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించారు. తక్షణమే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య హెచ్చరించారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ముడా వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు ఆందోళనకారులతో చర్చించారు. కౌలు రైతుల సమస్యలపై కలెక్టర్ అధ్యక్షతన త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణస్వామి, ఎం హరిబాబు, ఉపాధ్యక్షులు వాకా రామచంద్రరావు, సభ్యులు ఎస్ మూర్తిరాజు, పి దేవసహాయం, పివి శ్రీనివాసరావు, ఎం రవి, ఎన్ కొండలు తదితరులు పాల్గొన్నారు.