కృష్ణ

22లోపు ఎన్నికల వ్యయ నివేదికలు ఇవ్వకుంటే అనర్హత వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఈ నెల 22వతేదీ లోపు తమ ఎన్నికల ప్రచార వ్యయ నివేదికలను అందించాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో అనర్హత వేటు వేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు, అధికారులు, అభ్యర్థులు వారి ఎన్నికల ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల వ్యయంపై వెంటనే లెక్కలు అప్పగించాలన్నారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయం వివరాలు సమర్పించారన్నారు. అందించని వారు కూడా వెంటనే అందించాలన్నారు. బందరు పార్లమెంట్‌కు పోటీ చేసిన 12 మంది వ్యయ నివేదికలు సమర్పించారని తెలిపారు. విజయవాడ పార్లమెంట్‌కు పోటీ చేసిన 15 మందిలో ఇంకా ముగ్గురు మాత్రమే నివేదికలు ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంకా ఎన్నికల వ్యయం సమర్పించని అభ్యర్థులు 22వతేదీ లోపు అందచేయాలన్నారు. అభ్యర్థుల వ్యయం వివరాలు ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు మచిలీపట్నం, విజయవాడలో హెల్ప్ డస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు జయగణేష్, జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డీఆర్‌ఓ ప్రసాద్, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

చెరకు రైతులను ఆదుకోండి

ఉయ్యూరు, జూన్ 19: ఆరుగాలం పండించిన పంటకు ఫలసాయం రాకపోతే రైతు పడే ఆవేదనను మానవతాదృక్పథంతో చూసి ఆదుకోవాలని పెనమలూరు శాసనసభ్యులు కెపి సారధి విజ్ఞప్తి చేసారు. మార్కెట్‌లో చక్కెర అమ్మకాలు మందగించాయనే సాకుతో చెరకు పంట తోలిన రైతులకు సొమ్ము అందించడంలో తాత్సారం చేస్తున్న స్థానిక కెసిపి చెక్కెర కర్మాగార అధికారులతో బుధవారం ఆయన చర్చించారు. చెరకు రైతులు, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్ సమక్షంలో చర్చలు జరిపారు. కర్మాగార ముఖ్యకార్యనిర్వహణాధికారి జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అందుబాటులో ఉన్నంత వరకు రైతులకు బకాయిలు చెల్లిస్తున్నామని, తమ యాజమాన్యం రైతుకు ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కేన్ జనరల్ మేనేజర్ వివి పున్నారావుతో పాటు పలువురు అధికారులు, చెరకు రైతులు పాల్గొన్నారు.