కృష్ణ

వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం భారం కానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ: సమాజంలో సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం భారం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఉన్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. నందివాడ మండలంలోని తమిరిశ గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్థిలో భాగంగా ఇఓసి సిఎస్‌ఆర్ మరియు సహృదయ విద్య, ఆరోగ్య, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సౌజన్యంతో 21 లక్షల రూపాయల వ్యయంతోనూతనంగా నిర్మించిన పాఠశాల ప్రహారీ గోడ, సైకిల్ షెడ్, టాయిలెట్స్, సభావేదికను మంత్రి కొడాలి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, పాఠశాల పూర్వపు విద్యార్థి, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టరు గోపాలకృష్ణ గోఖలేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాని మాట్లాడుతూ పాఠశాల అభివృద్థికి తన వంతు సహకారాన్ని అందించిన పాఠశాల పూర్వ విద్యార్థి గోపాలకృష్ణ గోఖలే సేవలు అభినందనీయమని, తమిరిశ పాఠశాలలో ప్రాధమిక విద్యను ఆయన అభ్యసించారన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 600 గుండెకు సంబంధించిన శస్తచ్రికిత్సలు ఆయన చేశారన్నారు. వైద్య రంగంలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహూకరించిందన్నారు. ఇటీవల పాఠశాలను సందర్శించిన ఆయన ఇండియన్ ఆయిల్ కంపెనీ సిఎస్‌ఓలతో సంప్రదించి దానితోపాటు తన వంతు సహకారాన్ని అందించి పాఠశాలలో వౌలిక వసతులను అందించారన్నారు. దేశంలో ప్రతి వ్యక్తిపైనా ఖరీదైన భారం పడేవి రెండే రెండని అవి విద్య, వైద్యం అని, వీటిని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనూరాధ, గోపాల కృష్ణ గోఖలే మాట్లాడుతూ పాఠశాలకు అభివృద్థి కార్యక్రమాలు, దాతల సేవలు గురించి వివరించారు. కార్యక్రమంలో ఇఓసి చైర్మన్ రాహుల్ భరద్వాజ్, జనరల్ మేనేజర్ ప్రసాద్, సీనియర్ మేనేజర్ రమేష్, జడ్పీటీసీ సభ్యులు మీగడ ప్రేమ్‌కుమార్, ఎంపీపీ పుట్టి శ్రీరావమ్మ, విద్యాశాఖాధికారిణి కమలకుమారి, ఎంపిడిఓ పురుషోత్తమరావు, తహశీల్దార్ సుస్వాగతం, హెచ్‌ఎం రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.