కృష్ణ

ఆధ్యాత్మిక చింతనతో మెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: యాంత్రికమైన జీవన విధానంలో ప్రతి వ్యక్తి కొంత సమయాన్ని అధ్యాత్మిక చింతనకు కేటాయిస్తే మానసికోల్లాసంతో పాటు ఆందోళనలు నుంచి ఉపశమనం పొందవచ్చునని రాష్ట్ర పౌరసరఫరాశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. స్థానిక వెలమపేటలో నూతనంగా పునః నిర్మాణం చేపట్టిన శ్రీ పోతురాజు సమేత శ్రీ గంగానమ్మ పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఆదివారం వైభవంగా జరుగగా ఆయన పాల్గొని పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ దైవ చింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్, ఆలయ కమిటీ ప్రతినిధులు వంగపండు దుర్గారావు, చొక్కాపు తాతారావు, బి మల్లేష్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మూడెడ్ల వెంకటేశ్వరరావు, వైకాపా జిల్లా యువజన సంఘం కార్యదర్శి నౌడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. వెలమ సంఘీయులు, ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌కు ఘన స్వాగతం పలికి సత్కరించారు.