కృష్ణ

ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): రానున్న ఉగాది నాటికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ఆదివారం మత్రి పేర్ని నాని కార్యాలయానికి లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో చేరుకుని సమస్యలను విన్నవించుకున్నారు. పలువురు అర్జీ దారులు తమ కుటుంబాలకు వైద్య సహాయం అందించాలని కోరగా వెంటనే ఫోన్‌లో సంబంధిత అధికారులకు ఫోన్‌లో మాట్లాడి ఉన్నత వైద్యం అందించాలని సూచించారు. మరికొంత మంది వృద్దాప్య, కొంత మంది ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అర్జీలు అంద చేశారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అర్హులకు పెన్షన్‌లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ రానున్న ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2 నుండి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నదన్నారు. ప్రతి 50 కుటుంబాలకు గ్రామవాలంటీర్లను నియమించనున్నారన్నారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి ఈ వ్యవస్థ తోడ్పడుతుందన్నారు.

నివేశన స్థలాలకు 2,613 అర్జీలు
కూచిపూడి, జూన్ 23: వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలలో భాగంగా ప్రతి పేదవాడికి ఐదు సంవత్సరాలలో 25లక్షల గృహాలు నిర్మిస్తామన్న వాగ్ధానాలకు అనువుగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ శనివారంతో పూర్తయినట్లు తహశీల్దార్ ఎస్ అప్పారావు, ఎంపీడీఓ ఎన్ ఉమా ఆదివారం తెలిపారు. మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారులు, వీఆర్‌ఓలు, కార్యదర్శులు స్వీకరించిన దరఖాస్తులు ద్వారా 2,613 అర్జీలు అందినట్లు తెలిపారు. అత్యధికంగా కాజలో 393, భట్లపెనుమర్రులో 312, పెదపూడిలో 295, కూచిపూడిలో 176 అర్జీలు అందగా అత్యల్పంగా పాలంకిపాడులో పది మాత్రమే అర్జీలు అందాయని వారు తెలిపారు. ఇప్పటికే మండలంలోని భట్లపెనుమర్రు, పెదపూడి, మొవ్వలోని రెండు ప్రాంతాలలో నివేశన స్థలాలు అందచేసిన లబ్ధిదారులకు నూతనంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకంలో తమకు కూడా భాగస్వామ్యం చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన పట్టాలకు ప్రాధాన్యత కల్పించి తమకు న్యాయం చేయాలని ఆ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.